విభేదాలతో సినిమా వదులుకున్న సహజ నటి

Update: 2016-11-30 12:38 GMT

నలుపు తెలుపు చిత్రాల నుంచి నేటి వరకు కూడా నిర్విరామంగా నటిస్తున్న నటి జయసుధ. లీడ్ రొలెస్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయి కూడా అంతే బిజీగా వుంటున్నారు జయసుధ. దాదాపు దశాబ్ద కాలం పైగా రాజకీయాలలోని తన సేవలు అందిస్తున్నప్పటికీ ఎప్పుడూ వివాదాలలో చిక్కుకోలేదు ఆవిడ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో మురళి మోహన్ తరపున అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ప్రతిపక్ష ప్యానెల్ ఐన రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ సభ్యులపై ఆరోపణల మినహా జయసుధ వివాదాలతో వార్తల్లో నిలిచినా సందర్బాలు చాలా అరుదు. అటువంటి జయసుధ తన సహనం కోల్పోయి చిత్రీకరణ దశలో వున్న చిత్రం నుంచి వైదొలిగారని సమాచారం.

బిచ్చగాడు చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకున్న నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు నిర్మాణంలో స్వీయ దర్శకత్వంలో హెడ్ కానిస్టేబుల్ వెంకట రామయ్య చిత్రం గత కొంత కాలం కిందిట ప్రారంభం ఐన సంగతి విదితమే. ఆర్.నారాయణ మూర్తి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా సహజ నటి జయసుధ ను ఎంపిక చేసుకుని చిత్రీకరణ ప్రారంభించారు దర్శక నిర్మాత. మొదటి షెడ్యూల్ పూర్తి కాకముందే దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు జయసుధ ల మధ్య అభిప్రాయం భేదాలు తారా స్థాయికి చేరటంతో జయసుధ ఈ చిత్ర ఒప్పందం రద్దు చేసుకుని మధ్యలోనే వైదొలిగినట్లు సమాచారం. మరి నిర్మాత జయసుధ పాత్రకు మరొకరితో రీషూట్ చేసి చిత్రీకరణ కొనసాగిస్తారో లేక ప్రస్తుతానికి నిలిపివేస్తారో తెలియాల్సి వుంది.

Similar News