విజయ్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు..!

Update: 2018-08-28 07:03 GMT

ప్రస్తుతం థియేటర్స్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం సినిమా కుమ్మేస్తుంది. విడుదలై రెండు వారాలు కావొస్తున్నప్పటికీ.. ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న గీత గోవిందం సినిమాకి మెగా సపోర్ట్ బాగా దొరికింది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ లాభాలు ఆర్జించి పెట్టింది. అయితే అల్లు అర్జున్, మెగాస్టార్ చిరు, మహేష్ బాబు వంటి వారు ఈ సినిమాకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడంతో... ఆ రకంగానూ మెగా, ఘట్టమనేని ఫాన్స్ అంతా గీత గోవిందం సినిమాని హిట్ చెయ్యడంలో తమవంతు సహకరించారు. ఇకపోతే చాలా సింపుల్ స్టోరీ తో తెరకెక్కిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.

మా సినిమాని గుర్తు చేశారు...

అయితే నా సినిమాని కాపీ కొట్టారంటూ టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఒకాయన గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తునందు. ఆ వ్యాఖ్యలు చేసింది సరదాగానే లెండి. ఇంతకీ ఆ సీనియర్ దర్శకుడు ఎవరంటే కె రాఘవేంద్ర రావు.. ఈ మధ్య ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు గీత గోవిందం సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ... 20 ఏళ్ల క్రితం అల్లు అర‌వింద్ నిర్మాతగా నేను నా డైరెక్షన్ లో పెళ్లి సంద‌డి సినిమా తియ్యటం జరిగింది. మ‌ళ్లీ ఇన్నేళ్లకి గీత‌ గోవిందం సినిమా మా చిత్రాన్ని గుర్తు చేసింది. పరశురాం నా పెళ్లి సంద‌డి సినిమాని కాపీకొట్టాడు అంటూ రాఘవేంద్ర రావు ఫన్నీగా కామెంట్ చేశారు. ఇంకా పరశురామ్ గురించి రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ఒక సినిమాని తెరకెక్కిస్తున్న దర్శకుడికి నిర్మాత‌ల ద‌గ్గ‌ర నుంచి ఎంతో ఒత్తిడి ఉంటుంది. అలంటి ఒత్తిళ్లు పరశురాంకి కూడా ఎదురయ్యే ఉంటాయి. ఏమైనా తను ఇలాంటి ఓ మంచి చిత్రం తీసినందుకు సంతోషంగా ఉందని గీత గోవిందం టీమ్ ని అయన అభినందించారు.

Similar News