విజయ్ లైగర్ డేట్ వచ్చేసింది

గత ఆగస్టు నుండి సినిమా షూటింగ్స్ ప్రారంభమైనా థియేటర్స్ బంద్ వలన ఏ సినిమా రిలీజ్ కి రెడీ అవలేదు. కనీసం డేట్ ఇచ్చే సాహసము చెయ్యలేదు. [more]

Update: 2021-02-11 04:27 GMT

గత ఆగస్టు నుండి సినిమా షూటింగ్స్ ప్రారంభమైనా థియేటర్స్ బంద్ వలన ఏ సినిమా రిలీజ్ కి రెడీ అవలేదు. కనీసం డేట్ ఇచ్చే సాహసము చెయ్యలేదు. కానీ జనవరి లో సంక్రాతి సినిమాల ఊపు చూసి దర్శకులు, హీరోలు, పాన్ ఇండియా స్టార్స్ అంతా ఒక్కసారిగా తమ తమ సినిమాల రిలీజ్ డేట్స్ ని ప్రకటించేసారు. మార్చ్ నుండి అక్టోబర్ వరకు ఏ వీక్ ని వదలకుండా ఖచ్చిఫ్ లు వేసేసారు. అందులో ఎంతమంది డేట్ కి ఫిక్స్ అవుతారో.. ఎంతమంది వెనక్కి వెళతారో తెలియదు కానీ. చిరు ఆచార్య దగ్గరనుండి, RRR, నారప్ప, పుష్ప ఇలా భారీ బడ్జెట్ చిన్నా చితక సినిమాలన్ని పొలోమంటూ డేట్స్ లాక్ చేసేశాయి. కానీ పూరి – విజయ్ దేవరకొండలు కామ్ గా వేడుక చూసారు. గుంపులో గోవిందంలా లైగర్ డేట్ ఇవ్వడమెందుకు అనుకున్నారో ఏమో.. 

రీసెంట్ గా పూరి జగన్నాధ్ సాలా క్రాస్ బ్రీడ్ లైగర్ విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇంకా ఫ్రెష్ షెడ్యూల్ కి దిగని పూరి అండ్ విజయ్ లు ఈమధ్యనే టైటిల్ రివీల్ చేసారు. తాజాగా విజయ్ దేవరకొండ కిక్కిచ్చే పోస్టర్ తో సహా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసి మరీ వదిలారు. లైజర్ సెప్టెంబర్ 9 న వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. సాలా క్రాస్ బ్రీడ్ లైగర్ విజయ్ దేవరకొండ సెప్టెంబర్ 9 న రంగంలోకి దిగడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ముంబై లో ఫ్రెష్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది అని.. ప్రస్తుతం పూరి, ఛార్మి లైజర్ షూటింగ్ మొదలుపెట్టే ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారని అంటున్నారు. ఇక లైగర్ లుక్ లోనే బాక్సర్ స్టయిల్లో విజయ్ దేవరకొండ గత ఏడాదిగా కంటిన్యూ అవుతున్నాడు. మరి పూరి స్పీడు కి, విజయ్ దేవరకొండ జోరుకి సెప్టెంబర్ 9 న పాన్ ఇండియా థియేటర్స్ దద్దరిల్లాల్సిందే అంటున్నారు రౌడీ ఫాన్స్

Tags:    

Similar News