విజయ్ – పూరి టైటిల్ ఓ రేంజ్ లో ఉండబోతుందట!!

విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్ కాంబో లో తెరకెక్కుతున్న సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. ఈ సినిమా మొదలవడమే పెద్ద సెన్సేషన్. విజయ్ దేవరకొండ [more]

Update: 2020-05-20 08:42 GMT

విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్ కాంబో లో తెరకెక్కుతున్న సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. ఈ సినిమా మొదలవడమే పెద్ద సెన్సేషన్. విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చేశాడు. అయితే తాజాగా పూరి జగన్నాధ్ ఈ సినిమా కథని విజయ్ దేవరకొండ ని దృష్టిలో పెట్టుకునే రాసుకున్నాడని.. మొదటిసారి కథ చెప్పినప్పుడే విజయ్ దేవరకొండ బాగా ఇంప్రెస్స్ అయ్యి సినిమా ఒప్పుకున్నాడని చెబుతుంది పూరి పార్టనర్ ఛార్మి. ఛార్మి కూడా పూరి – విజయ్ కాంబోలో మూవీ కి పూరి తో పాటుగా నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ గా మొదటినుండి ఫైటర్ అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే ఫైటర్ సినిమా టైటిల్  కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని.. పూరి – విజయ్ కాంబో టైటిల్ ఓ రేంజ్ లో ఉండబోతుంది అని.. ఆ టైటిల్ అలాంటి ఇలాంటి టైటిల్ కాదని.,… ఇప్పటికే అన్ని భాషలకు సరిపోయే టైటిల్ ని పూరి జగన్నాధ్ సెట్ చేసాడని.. ఓ మంచి ముహూర్తం చూసి ఆ టైటిల్ ని ఎనౌన్స్ చేస్తారని చెబుతుంది ఛార్మి. ఇక ఛార్మి విజయ్ సినిమా ముచ్చట్లు చెబుతూ.. ముంబై పరిసర ప్రాంతాల్లో తిరిగె కథ ఈ సినిమా అని.. ఇప్పటికే 40 శాతం షూటింగ్ ముంబై పరిసరాల్లోనే పూర్తి చేశామని.. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి అక్కడ షూటింగ్ చెయ్యడం ఎలా అని టీం మొత్తం ఆలోచిస్తున్నామని… అక్కడి ప్రభుత్వ పర్మిషన్ తీసుకున్నాకే షూటింగ్ కి రెడీ అవుతామని చెబుతుంది ఛార్మి.

Tags:    

Similar News