విజయ్ తన మనుసులో మాట బయటపెట్టాడు

Update: 2017-12-07 09:00 GMT

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు విజయ్ దేవరకొండ. తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఇండియా మొత్తం ఫేమస్ అయ్యాడు మనవాడు. అయితే విజయ్ ఎంచుకునే కథ ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు గని... ఆ సినిమాపై కొంచెం భారీ అంచనాలు ఉంటాయని చెప్పవచ్చు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ లో తెరకెక్కుతోన్న ఆ సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా ఏదైనా కొత్తదనం ఉన్న కథలనే ఒకే చేస్తానని ఇంతకుముందు విజయ్ చెప్పాడు. అయితే ఇటీవల జరిగిన ఒక కన్నడ సినిమా ఆడియో వేడుకలో తన మనసులోని కోరికను చెప్పాడు.

రష్మిక మందాన్నా - గణేష్ కాంబినేషన్ లో చమక్ ఆడియో లాంచ్ కి వెళ్లిన విజయ్.. సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఫ్తీ ట్రైలర్ ని చూసి నాకు కూడా ఇలాంటి గ్యాంగ్ స్టార్ సినిమా చేయాలనుంది అని తన మనసులో మాట చెప్పాడు. ఇంతే కాదు కన్నడ ఇండస్ట్రీపై ప్రశంసల జల్లును కురిపించారు. మరి మనవాడు బాడీ లాంగ్వేజ్ తగట్టు ఎవరన్నా దర్శకులు గ్యాంగ్ స్టార్ కథ రాసి విజయ్ ని డైరెక్ట్ చేస్తారో లేదో చూడాలి.

Similar News