విజయ్ కాలుజారడా?

విజయ్ దేవరకొండ కాలు జారడా… అంటే ఏమిటో అనుకునేరు. విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ సినిమా కోసం ముంబై లో ఉన్నాడు. ఛార్మి – పూరి జగన్నాధ్ [more]

Update: 2020-03-05 13:26 GMT

విజయ్ దేవరకొండ కాలు జారడా… అంటే ఏమిటో అనుకునేరు. విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ సినిమా కోసం ముంబై లో ఉన్నాడు. ఛార్మి – పూరి జగన్నాధ్ కంబైన్డ్ గా కరణ్ జోహార్ హ్యాండ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం కోసం విజయ్ దేవరకొండ ఫైటర్ గా మారాడు. విజయ్ దేవరకొండ లుక్, బాడీ బిల్డింగ్ అన్ని సినిమా మీద క్రేజ్ ని పెంచేస్తున్నాయి. హీరోయిన్ అనన్య పాండే తో విజయ్ దేవరకొండ రొమాంటిక్ యాంగిల్ అంతా ఈ మధ్యన సోషల్ మీడియాలో లీకై అందరిని ఆకర్షించింది. అనన్య పాండే బైక్ మీద రొమాంటిక్ గా ఎక్కించుకుని విజయ్ బైక్ రైడ్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్లిన విజయ్ దేవరకొండ కాలుజారి పడిపోబోతే.. పక్కనే ఉన్న గార్డ్స్ అతన్ని పడకుండా పట్టుకున్న వీడియో ఒకటి మీడియాలో వైరల్ అయ్యింది. షూటింగ్ నిమిత్తం పూరీ జగన్నాథ్, చార్మీ తదితరులు బోటులో ముందు వెళ్లిపోగా.. విజయ్ దేవరకొండ మాత్రం చివరిగా రావడం.. ఆ క్రమంలో విజయ్ దేవరకొండ ని ఆయన అభిమానులు విష్ చేస్తూ విజయ్ అన్నా విజయ్ అన్నా అంటూ అరవడంతో. వారికీ అభివాదం చేస్తూ నడుస్తున్న విజయ్.. రోడ్డు నుంచి బోట్ వరకూ వచ్చే దారి కాస్తంత ఇరుకుగా.. ఉండడం అలాగే చుట్టూతా మరపడవలు అడ్డుగా ఉండడంతో.. వాటి మధ్య నుండి విజయ్ అభిమాలు అభివాదం చేస్తూ నడవంతో చూసుకోకుండా కాలు జారీ పడబోగా.. ఆయన సహాయకులు విజయ్ దేవరకొండ ని పడకుండా పట్టుకుని సేవ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

Tags:    

Similar News