విక్ర‌మ్‌, స‌మంత `10` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

Update: 2017-09-26 15:00 GMT

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సెన్సేష‌న‌ల్ స్టార్ చియాన్ విక్ర‌మ్ హీరోగా బ్యూటీఫుల్ స‌మంత హీరోయిన్‌గా రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ '10 ఎన్న‌త్తు కుల్ల‌'. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ నిర్మించిన ఈ చిత్రం త‌మిళంలో పెద్ద హిట్ మూవీగా నిలిచింది. ఫాక్స్‌స్టార్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ సుబ్ర‌మ‌ణ్యేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్ర‌మ‌ణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావ్ చింత‌ప‌ల్లి ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. విజ‌య్ మిల్ట‌న్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను నిర్మాత‌లు ఈరోజు విడుద‌ల చేశారు. అనువాద కార్య‌క్ర‌మాల‌న్నింటినీ పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున‌నారు. త్వ‌ర‌లోనే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌, ఆడియో విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు.

చియాన్ విక్ర‌మ్‌, స‌మంత‌, ఛార్మి, ప‌శుప‌తి, రాహుల్ దేవ్‌, అభిమ‌న్యు సింగ్‌, సునీల్ తాపా త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః డి.ఇమాన్‌, సినిమాటోగ్రాఫ‌ర్ః భాస్క‌రన్ కె.ఎం, నిర్మాత‌లుః జి.సుబ్ర‌మ‌ణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావ్ చింత‌ప‌ల్లి, ద‌ర్శ‌క‌త్వంః విజ‌య్ మిల్ట‌న్‌.

Similar News