వారి వైద్య ఖర్చులు బాహుబలి నిర్మాత భరించాలన్న వర్మ

Update: 2017-04-30 13:09 GMT

ఈ మధ్య కాలంలో ఒక్క మెగా ఫామిలీ కి తప్ప ఇతర టాలీవుడ్ స్టార్స్ ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా విడుదలైన ఇండియన్ ఫిలిం బాహుబలి ది కంక్లూషన్ పై తనదైన శైలిలో ట్వీట్లతో ముంచేశాడు వర్మ. బాహుబలి సృష్టిస్తున్న అలజడితో దర్శకులందరికి వెన్నులో వణుకు పుట్టిందని, రాజమౌళి పై ఈర్ష్యతో రగిలిపోతున్నామంటూ తన గురించి కూడా కలుపుకుని చెప్పిన రామ్ గోపాల్ వర్మ అంతటితో ఆగకుండా డైరెక్టర్స్ అందరికి బాహుబలి జెలసిస్ట్స్ అనే వైరస్ సోకటంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని చెప్తూ పండుగ దినం, సెలవు దినం కాకపోయినా, ఆమిర్, సల్మాన్, షారుఖ్ వంటి స్టార్స్ లేని ఒక డబ్బింగ్ సినిమా బాలీవుడ్ లో సృష్టించిన సంచలనం తో రాజమౌళి బాలీవుడ్ మేటి దర్శకుల చెంపపై కొట్టాడని అభివర్ణిస్తూ, రోషన్స్, కపూర్స్, ఖాన్స్ కుటుంబాలకంటే రాజమౌళి క్రేజ్ చాలా పెద్దది అని ఎవరు అందుకోలేదని చెప్పాడు వర్మ. అలానే బాహుబలి నచ్చని ప్రేక్షకులు మానసిక వైద్యుల దగ్గర చికిత్స పొందాలని సూచిస్తూ అలాంటి ప్రేక్షకుల వైద్య ఖర్చులు నిర్మాత శోభు గారే ఛారిటీ కింద భరించాలి అంటూ బాహుబలి క్రిటిక్స్ పై చతుర్లు విసిరాడు వర్మ.

Going by MegaDinosaur day1 it's clear @ssrajamouli is bigger than all Khans,Roshans and Chopras..I salute @karanjohar for discovering him🙏

All people of india who luvd BB2 should touch the feet of @karanjohar for him having the genius to discover a diamond like @ssrajamouli 🙏🙏🙏

Like world was divided into BC and AD (before death of Christ nd after ) Indian cinema is going to be BB and AB(before Bahubali and after)

Every super star nd every super director in entire Bollywood is shivering in various places looking at impact of @ssrajamouli 's Bahubali2

No Eid.No Diwali.No Salman.No Aamir No Sharukh n still dub film #Baahubali2 opens biggest in History.. @ssrajamouli slaps face of Bollywood

I just got admitted in hospital infected with Bb2Jealousitis and am glad to see all film makers are already admitted and many in ICU

Be sad on person who disliked #Baahubali2 as he/her needs psychiatric help nd I request producer @Shobu_ in to pay doctor bill for charity

Similar News