వాని కపూర్ తో రాంప్ వాక్ చేసిన అఖిల్

Update: 2017-03-23 11:13 GMT

అతి చిన్న వయసులో చిత్ర పరిశ్రమలో కథానాయకులుగా పరిచయమైన వారిలో తారక్, అఖిల్ అక్కినేని లు ప్రధమంగా కనిపిస్తారు. వీరిలో తారక్ కథానాయకుడిగా పరిచయమైన నిన్ను చూడాలని చిత్రం నామమాత్రపు అంచనాలతో పరిమిత బడ్జెట్ లో రూపొందగా, అఖిల్ అక్కినేని తొలి చిత్రం అఖిల్ మాత్రం భారీ అంచనాలతో పరిచయ కథానాయకుడికి తెలుగులో ఎన్నడూ లేని బడ్జెట్ తో తెరకెక్కింది. అంత చిన్న వయసులో తన పై ఏర్పడ్డ భారీ అంచనాలను హేండిల్ చెయ్యలేకపోయాడు అఖిల్. అఖిల్ చిత్రం విడుదలై 16 నెలలు పూర్తయ్యి నప్పటికీ అఖిల్ రెండవ చిత్రం షూటింగ్ ప్రారంభానికి నోచుకోలేదు.

ముందుగా హను రాఘవపూడి చెప్పిన కథ ఓకే చేసిన అక్కినేని నాగార్జున తరువాత ఆ కథ బదులు మరి కొన్ని కథలు అయితే విన్నారు కానీ హను రాఘవపూడి తో అఖిల్ రెండవ చిత్రం మెటీరియలైజ్ కాలేదు. దానితో వారి కుటుంబానికి మర్చిపోలేని విజయాన్ని ఇచ్చిన విక్రమ్.కే.కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండవ చిత్రాన్ని ఫైనల్ చేశారు నాగ్. ఈ చిత్రానికి కథ లాక్ ఐయి ఇప్పటికే ఆరు మాసాలు పూర్తి కావస్తుంది. జున్ను అనే పేరు కూడా పరిశీలనకు వచ్చింది. కానీ షూటింగ్ షెడ్యూల్స్ విషయమై ఇంకా స్పష్టత రాలేదు. అయితే అఖిల్ ఈ గ్యాప్ ని బొంబాయి లో గడుపుతున్నాడు. వరుసగా బాలీవుడ్ ఈవెంట్స్ కి, బాలీవుడ్ పార్టీస్ కి హాజరు అవుతూ బొంబాయి సెలబ్రిటీ గా మారుతున్నాడు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ కాస్ట్యూమ్ డిసైనర్ మనీష్ మల్హోత్రా ఏర్పాటు చేసిన ఫాషన్ షో కి షో స్టార్టర్ గా వాని కపూర్ రాంప్ వాక్ ఉండగా, ఇదే రాంప్ పై వాని కపూర్ కి జంటగా అక్కినేని అఖిల్ రాంప్ వాక్ చేయటం విశేషం. ఇప్పుడు ఈ ఫాషన్ షో ఫోటోలని అఖిల్ స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు.

Similar News