వాటిని ఐటెం సాంగ్స్ అని ఎలా అంటారు?

Update: 2017-02-18 07:32 GMT

బుల్లి తెర పై ఫుల్ ఫామ్ లో వున్నా హాట్ యాంకర్ అనసూయ సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం చిత్రాలతో వెండి తెరపై కూడా లక్కీ లెగ్ గానే పరిగణించబడుతోంది. క్షణం చిత్ర విజయం అనంతరం ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ బుల్లి తెరపై అనసూయకి వున్న కమిట్మెంట్స్ వల్ల సినిమా అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఇప్పుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విన్నర్ చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో నర్తించింది అనసూయ. విన్నర్ ఆల్బం లో ఈ పాటకి మంచి స్పందన దక్కుతుంది. కాగా ప్రేక్షకులు ఈ పాటని ఐటెం సాంగ్ గా గుర్తించటాన్ని తప్పు పడుతుంది అనసూయ.

"నాకు అసలు ఐటెం అనే పదమే నచ్చదు. పాటల్లో నాట్యం చేసే వారు వస్తువులు కాదు కదా. మేము కూడా మనుషులమే. అలాంటప్పుడు ఐటెం అనే పదం ఎలా వాడతారు? ఈ కల్చర్ బాలీవుడ్ నుంచి వచ్చింది. స్పెషల్ స్టార్స్ సినిమాలో ఏదో ఒక పాటలో మాత్రమే కనిపిస్తుంటారు కాబట్టి ఈ తరహా పాటలని స్పెషల్ సాంగ్స్ అనాలి. అయితే నాకు ఈ స్పెషల్ సాంగ్స్ లో డాన్స్ చేయటం కానీ, స్పెషల్ అప్పియరెన్స్లు ఇవ్వటం కానీ అసలు ఆసక్తి ఉండదు. కానీ విన్నర్ సినిమాలో నేను చేసిన పాట లిరిక్స్ ని ముందుగా నాకు వినిపించి పాట మొత్తం నీ పేరు మీదనే సాగుతుంటుంది, పైగా సరదాగా సాగే పాట అని చెప్పటంతో ఒప్పుకున్నాను. నేను ఒప్పుకునే సమయానికి ఈ పాట సుమ గారు పాడారని నాకు తెలియదు. తరువాత సుమ గారే ఫోన్ చేసి నువ్వు చేయబోయే పాట పాడింది తానే అని చెప్పారు." అని విన్నర్ లో అనసూయ చేసిన 'స్పెషల్' సాంగ్ వెనుక విషయాలను చెప్పిందీ హాట్ యాంకర్.

Similar News