వసూళ్లలోనే కాదు వ్యూస్ లోనూ నేను లోకల్ తోపే

Update: 2017-02-15 06:11 GMT

నాచురల్ స్టార్ నాని విజయ పరంపరను కొనసాగిస్తూ ఫిబ్రవరి 3 న విడుదలైన నేను లోకల్ సూపర్ హిట్ ఐయ్యి తొలి నాలుగు రోజులకే బయ్యర్స్ ని ప్రాఫిట్ జోన్లో పడేసింది. రెండవ వారం కూడా స్ట్రాంగ్ రన్ దక్కించుకుంటున్న నేను లోకల్ చిత్రం మల్టీప్లెక్స్ ప్రేక్షకుల దగ్గర నుంచి సి సెంటర్ ప్రేక్షకుల వరకు అందరిని అమితంగా ఆకట్టుకుంటోంది. తొలి రోజు సెకండ్ హాఫ్ వీక్ గా ఉందన్న టాక్ వినిపించినప్పటికీ ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై ఏ మాత్రం పడలేదు. ఈగ తరువాత నాని 30 కోట్ల రూపాయలకు చేరువ అవుతున్న చిత్రం ఇదే కావటం విశేషం. గత వారం విడుదలైన ఓం నమో వెంకటేశాయ మరియు ఎస్-3 చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ ప్రభావం చూపకపోవటంతో నేను లోకల్ చిత్రానికి మార్గం సుగమం ఐయ్యింది.

ఇదిలా ఉండగా దిల్ రాజు తాజాగా నేను లోకల్ చిత్రంలో నుంచి కొన్ని డిలీటెడ్ సన్నివేశాలని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఒకప్పుడు ప్రతి దర్శకుడు సినిమా నిడివి కచ్చితంగా రెండున్నర్ర గంటల పాటు ఉండేలా జాగ్రత్తలు తీసుకునే వారు. కానీ ఇప్పుడు హాలీవుడ్ చిత్రాల స్థాయిలో గంటా నలభై ఐదు నిమిషాల నిడివితో కూడా మన చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కమర్షియల్ చిత్రాలలో వుండే పాటలు, ఫైట్స్ కారణంగా ఇవి రెండు గంటల పదిహేను నిమిషాలు లేదా అంతకంటే తక్కువ వుండేలానే జాగ్రత్త పడుతున్నారు తప్పితే రెండున్నర్ర గంటల నిడివితో వచ్చి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే ప్రయత్నాలు ఎవరూ చేయటం లేదు. అలా అని ఎడిటింగ్ ఫైనల్ కట్ జరిగే సమయానికి సరిగ్గా సినిమా కోరుకున్న నిడివి తో ఉండదు. చాలా ఫ్యూటేజి మిగిలిపోతుంటుంది. సినిమా బాగా ఆడుతుంటే విడుదల అనంతరం కొన్ని అదనపు సన్నివేశాలు జోడిస్తుంటారు. ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా మారిపోయింది. సినిమా ఫలితం ఎలా వున్నా డిలీటెడ్ సీన్స్ అంటూ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి వ్యూస్ పరంగానూ బిజినెస్ చేసుకునే వెసులుబాటు నిర్మాతలకు కలుగుతోంది. నేను శైలజ చిత్రానికి ఇలానే చేశారు. ఇప్పుడు నేను లోకల్ లో ఫస్ట్ సాంగ్ కి లీడ్ సీన్స్ కొన్ని ఎడిటింగ్ టేబుల్ వద్దనే ఆగిపోగా వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి అధిక వ్యూస్ దక్కించుకుంటున్నారు దిల్ రాజు.

Similar News