వర్మ వైఖరి పై మెగా ఫామిలీ నవ్వుకుంటుందట

Update: 2017-02-04 09:24 GMT

మెగా స్టార్ చిరంజీవి అనగానే చిత్ర పరిశ్రమ అంతా ప్రశంసలతో పొగిడేస్తుంటారు. ఒక్క రామ్ గోపాల్ వర్మ తప్ప. చిరంజీవి స్టోరీ సెలక్షన్ పై వేలెత్తి చూపిన ఏకైక వ్యక్తి రామ్ గోపాల్ వర్మే నేమో. వర్మ మెగా స్టార్ పై చేసిన ట్వీట్లు చిరంజీవి క్యాపబిలిటీని ప్రశ్నించే విధంగా వున్నప్పుడు కూడా మెగా ఫామిలీ లో ఎవరూ వర్మ ట్వీట్స్ ని ఖండించటం కానీ, వర్మ పై విమర్శలు చేయటం కానీ జరగలేదు. కానీ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైతే మెగా స్టార్ ని దాటుకుని తన పైత్యాన్ని మెగా అభిమానులపై చూపటం ప్రారంభించాడో అప్పటి నుంచి కొణిదల నాగ బాబు తో మొదలుకొని ఇప్పుడు చిరంజీవి కూతురు సుస్మిత వరకు అందరూ వర్మ శైలిని ఎండకడుతూనే వున్నారు.

మెగా స్టార్ తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తరువాత నటించిన ప్రతిష్టాత్మక 150 వ చిత్రం ఖైదీ నెం.150 చిత్తానికి కాస్ట్యూమర్ గా పని చేసిన సుష్మిత తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మెగా ఫామిలీ మొత్తం గర్వంగా భావించిన ఖైదీ నెం.150 చిత్రం ఒక తమిళ సినిమాకు రీమేక్ కావటం చిరంజీవి తన అభిమానులకు చేస్తున్న అవమానంగా అభివర్ణించడం మీకెలా అనిపించింది అని అడిగిన ప్రశ్నకు, "నేను ఖైదీ నెం.150 సెట్స్ లో వున్నన్ని రోజులలో ఆర్.జి.వి ట్వీట్స్ ని సీరియస్ గా తీసుకుని వచ్చి చర్చించిన వారిని ఎవరినీ చూడలేదు. ఇక మా ఇంట్లో అయితే మేము అంతా కలిసి లంచ్ చేస్తున్నప్పుడు వర్మ ట్వీట్స్ గురించి చర్చించుకుని నవ్వుకుంటుంటాం తప్ప మరోలా అసలు రియాక్ట్ అవ్వము." అంటూ చాలా ఈజీ గా తీసుకుంది సుష్మిత.

Similar News