వరుణ్‌ తేజ్ ఇలా వెళితేనే బెటర్..!

Update: 2017-06-19 06:01 GMT

మెగాహీరోలంటే కావాల్సినంత ఎనర్జీ, డ్యాన్స్‌లు, ఫైట్స్‌లో ఇరగదీసి, వారెవ్వా.. అనిపించాలి. ఫుల్‌ ఎనర్జీతో అదరగొట్టాలి. కానీ ఇవే లక్షణాలు లేని హీరో వరుణ్‌తేజ్‌. నిజానికి నటనతో మెప్పించే ఆయన పాటలు, ఫైట్స్‌తో పాటు కాస్త చురుగ్గా, చలాకీగా ఉంటే ఆయనకున్న కటౌట్‌కి ఇప్పటికే పెద్ద హీరో అయిపోయేవాడు. కానీ ఆదిశగా వరుణ్‌తేజ్‌ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

'ముకుందా, కంచె' వంటి విభిన్న చిత్రాలలో నటించి మెప్పించాడు. కానీ మాస్‌, కమర్షియల్‌ అంశాలవైపు వెళ్లి 'లోఫర్‌, మిస్టర్‌' చేశాడు. రెండూ దెబ్బతీశాయి. నటునిగా కూడాచెడ్డపేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి జంటగా చేస్తున్న 'ఫిదా' కూడా హృదయాలకు హత్తుకునే ప్రేమకథ అని పోస్టర్స్‌ని చూస్తే తెలుస్తోంది.

ఇక ఆ తర్వాతి చిత్రంగా కొత్త దర్శకుడు వెంకీ అట్లూరితో మరో ప్రేమకథను ఎంచుకున్నాడు. ఇందులో కూడా ఆయన చాలా సాప్ట్‌ నేచర్‌తో కూడిన హీరోగా నటిస్తున్నాడని సమాచారం. ఈ పద్దతి మంచిదే. తెలుగులో నేడు విభ్ని చిత్రాలు చేసే అసలుసిసలైన మొనగాళ్లు, తోపులెవ్వరూ లేరు. కానీ ఈ ఇమేజ్‌తో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పటికే పాటలు,అందులోని డ్యాన్స్‌లు, ఫైట్స్‌లో మనవాడు వీక్‌ అని, విభిన్నచిత్రాల హీరో అని బ్రాండ్‌ వేశారు.

వరుణ్‌ లాగానే సాయిధరమ్‌తేజ్‌ కూడా అదే సమయంలో వచ్చిన హీరో అయినప్పటికీ మాస్‌ని తన ఎనర్జీ, ఫైట్స్‌, స్టెప్స్‌లో ఇరగదీస్తున్నాడు. రెండు మూడు చిత్రాలు ఆడకపోయినా ఆయనకంటూ ఓన్‌ అభిమానులను ఓపెనింగ్స్‌నుతెచ్చే మినిమం రేంజ్‌ మాస్‌ హీరోగా కనిపిస్తున్నాడు. మరి ఆ దారిలో వెళ్లాలా? లేదా? తనదైన దారిలో వెళ్లాలా? అని వరుణ్‌ ఊగిసలాడుతున్నారు.

మెగాభిమానులు, వారి కుటుంబసభ్యుల మాస్‌ హీరో కావాలని ఆశిస్తుంటే.. సామాన్య ప్రేక్షకులు, విమర్శకులు, విశ్లేషకులు మాత్రం తెలుగులో విభిన్న చిత్రాలను పోషించే నటుల కొరత ఉన్నందువల్ల వరుణ్‌తేజ్‌ క్లాస్‌హీరోగా ఉండటమే మంచిదని సలహా ఇస్తున్నారు.

Similar News