వరుడుకుండాల్సిన అర్హతలు

Update: 2017-11-13 13:00 GMT

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు ఇప్పుడు మరో పెళ్ళికి రెడీ అవుందనే విషయం ఆమే స్వయంగా తెలిపింది. అయితే పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం రేణు... పవన్ తో విడిపోయినా కూడా ఆమె మరో పెళ్లి చేసుకోవడం కుదరదన్నట్టే రచ్చ చేశారు. తమ హీరో ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్న పర్లేదు గాని మాజీ భార్య మరో పెళ్ళికి సిద్ధపడితే మాత్రం అదేదో పెద్ద గోరం, నేరం అన్నట్లుగా మాట్లాడారు. అయితే రేణు దేశాయ్ ఎప్పుడు మీడియాతో మట్లాడినా... ఆమె ఎలా మాట్లాడినా కూడా పవన్ ఫాన్స్ ఆమెను డీప్ గా వాచ్ చేస్తూనే ఉంటారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత తన ఇద్దరు పిల్లల బాధ్యతలు నెరవేరుస్తూ వస్తున్న రేణుకి తనకి ఓ తోడు కావాలనిపించి మరో పెళ్ళికి సిద్దమయ్యింది. అనారోగ్యంతో ఉన్నప్పుడు తనకి ఓ తోడుండాలని ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా ఓపెన్ గానే చెప్పింది.

అయితే రేణు దేశాయ్ నిర్ణయం ఏమంత ఘోరమైంది కాదు. అయితే ఈసారి ప్రేమ పెళ్లి చేసుకోనని... పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుంటానని... అందుకే తన పెళ్లి నిర్ణయాన్ని ముందుగా పెద్దవాళ్ళకి చెప్పగా.. వాళ్ళు సంతోషం గా ఫీల్ అయ్యారని... చెబుతుంది. అయితే ఈసారి సినీ ఇండస్ట్రీ లోని వ్యక్తులను గాని... పొలిటికల్ వ్యక్తులను గాని.. పెళ్లి చేసుకోనని.. ఇప్పుడు కూల్ గా సెటిల్డ్ గా ఉండాల్సిన సమయమని.... పిల్లలు పెద్దోళ్ళవుతున్నారని... ఇలాంటి సమయంలో తన లైఫ్ గందరగోళంలో పడకూడదని.. అందుకే కొంచెం కామ్ గా కూల్ గా ఉండే భర్తని కావాలనుకుంటున్నట్లుగా చెబుతుంది రేణు.

అలాగే తనకి తనకి కాబోయే భర్తకి పవన్ మాజీ భార్య అనే ట్యాగ్ లైన్ తో పాటు.. అభిమానుల నుంచి వచ్చే ఇబ్బందుల్ని కూడా పేస్ చెయ్యాల్సిన అవసరం ఉంటుందని.... అందుకే ముందుగా తనకు కాబోయే భర్తకు ఈ విషయాలన్నీ వివరిస్తామని చెబుతుంది. అసలు తనని మరో పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చేవాళ్లలో తన కొడుకు అకీరా కూడా ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది రేణు. ఇక తనకు రాబోయే భర్త తన ఇద్దరు పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలని... మంచి మనసున్న వ్యక్తి అయితే ఇంకా బెటర్ అని చెబుతుంది. పాపం ఈ విషయం పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఎప్పుడు అర్ధమవుతుందో ఆ దేవుడికే ఎరుక.

Similar News