లో బడ్జెట్ చిత్రానికి కూడా తాప్సి కోటి తీసుకుందా!!

Update: 2018-01-27 12:00 GMT

ఝమ్మంది నాదం చిత్రంతో సినిమా పరిశ్రమకి పరిచయమైన తాప్సి పన్ను పెద్ద చిత్రాలలో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఫలితాల విషయంలో అవి బోల్తా కొట్టటంతో అమ్మడి పై ఐరన్ లెగ్ ముద్ర వేసేసారు. ఆ అవమానం భరించలేకే తనకి గుర్తింపు వున్న పాత్రలు ఇస్తున్న బాలీవుడ్ లో పనిచేస్తున్నానని చెప్పిన తాప్సి గత ఏడాది ఆనందో బ్రహ్మ అనే లో బడ్జెట్ హారర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది కూడా.

ఇప్పుడు లీక్ చేసి....

ఇంత కాలం తరువాత ఈ చిత్ర విషయాలు ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? అక్కడే వుంది అసలు విషయం. తాప్సి ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో బాలీవుడ్ కి వెళ్లిన తరువాత తిరిగి తెలుగు లో ఆనందో బ్రహ్మ చేయటానికి కారణాలు అడగగా, ఆ చిత్ర దర్శక నిర్మాతలు తనకి స్క్రిప్ట్ నేరేట్ చేసి ఆ పాత్ర తనే పోషించాలని ఏడాది వెయిట్ చేశారని, తనకి అంత ప్రాధాన్యం ఇవ్వటంతో పాటు ఆ చిత్రానికి కోటి రూపాయల పారితోషికం ఇవ్వటంతో చేశానని చెప్పుకొచ్చింది. అంత లో బడ్జెట్ చిత్రమైనా హీరోయిన్ మాత్రమే సినిమా సెల్లింగ్ ఫాక్టర్ అని నమ్మిన నిర్మాతలు తాప్సి ని ఎంచుకుని అంత మొత్తం చెల్లించినప్పటికీ సినిమా లాభాల బాటలో నిలవటంతో సేఫ్ అయ్యారు.

Similar News