లేడీ ఓరియెంటెడ్ కథ కోసం కెరీర్ రిస్క్ చేస్తోంది

Update: 2017-03-01 20:30 GMT

సినిమా పరిశ్రమలో కథానాయికలకు అనుభవం తక్కువ వున్న రోజులలోనే ఎక్కువ అవకాశాలు దక్కుతుంటాయి. వారి నట జీవితంలో సాగ పుష్కర కాలం దాటినా నాటి నుంచి అవకాశాల కొదవ ప్రారంభం అవుతుంటుంది. అయితే కొంత మంది కథానాయికలు మాత్రం దశాబ్ద కాలం పాటు అగ్ర కథానాయకుల సరసన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో అగ్ర కథానాయికలుగా నిలదొక్కుకుంటున్నారు. ఇటీవల తన నట జీవితంలో దశ్శబ్ధ కాలం పూర్తి చేసుకున్న కాజల్ అగర్వాల్ కూడా ఇదే కోవకు చెందుతుంది. ఈ ఏడాది ఖైదీ నెం.150 తో సూపర్ సక్సెస్ ఇప్పటికే అందుకుంది కాజల్ అగర్వాల్.

ఇంత కాలం వెండితెర పై హీరోయిన్ గా కొనసాగడంతో దాదాపు అందరి స్టార్ హీరోస్ తో నటించేసింది కాజల్. ఇక ఇప్పుడు హీరోలు అవుతున్న యువ హీరోలతో 30 వయసు దాటిన కాజల్ కి అవకాశాలు దక్కవు. సో ఇప్పటికీ కథానాయికగా కొనసాగాలంటే వున్న ఒకేఒక్క ఆప్షన్ హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్. తొలి సారి కాజల్ తమిళంలో ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని ఒప్పుకుంది. అయితే గత ఏడాది డీకే అనే దర్శకుడు తెరకెక్కించిన తమిళ చిత్రం కావాలి వెందాం లో జీవకి జంటగా నటించింది కాజల్. ఆ చిత్రం ఘోర పరాజయం చెందటంతో కాజల్ కి ఏ మాత్రం ఉపయోగపడలేదు. కానీ కాజల్ మరొక్కసారి ఇదే దర్శకుడికి నేతృత్వంలో లేడీ ఓరియెంటెడ్ ఫిలిం చేయటానికి ఒప్పుకుని రిస్క్ చేస్తుంది. ప్రస్తుతానికి అజిత్ సరసన వివేగం మరియు రానా సరసన పొలిటికల్ డ్రామా చిత్రంలో నటిస్తున్న కాజల్ కెరీర్ ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

Similar News