లెక్కలంటే భయమంటున్న డాక్టర్ పిల్ల!!

లెక్కల క్లాస్ ఎగొట్టడానికి యాక్టర్ అవ్వాలనుకుందట ఫిదా భానుమతి సాయి పల్లవి. లెక్కల క్లాస్ అంటే ఒణుకుపుట్టేదని.. లెక్కలంటేనే భయమంటుంది కాబట్టే ఈ పిల్ల డాక్టర్ అయినట్లుగా [more]

Update: 2020-01-19 13:29 GMT

లెక్కల క్లాస్ ఎగొట్టడానికి యాక్టర్ అవ్వాలనుకుందట ఫిదా భానుమతి సాయి పల్లవి. లెక్కల క్లాస్ అంటే ఒణుకుపుట్టేదని.. లెక్కలంటేనే భయమంటుంది కాబట్టే ఈ పిల్ల డాక్టర్ అయినట్లుగా ఉంది. మరి డాక్టర్ కాక ముందే సాయి పల్లవికి సినిమా అవకాశాలొచ్చాయట. అయితే సాయి పల్లవి కూడా మాథ్స్ క్లాస్ కి డుమ్మా కొట్టడానికి సినిమాల్లోకి రావాలని ఫిక్స్ కూడా అయ్యిందట. కానీ సాయి పల్లవి పేరెంట్స్ ఆమెతో ఇప్పుడు సినిమాల్లోకి వెళ్తావ్ ఓకె… కానీ ఐదేళ్ల తర్వాత నీకు సినిమా అవకాశాలు లేకపోతె ఏం చేస్తావ్ అని అడగడంతో.. చదువు మీద సీరియస్ నెస్ తో.. ముందు స్టడీస్ తరువాతే సినిమాలని ఫిక్స్ అయ్యిందట సాయి పల్లవి.

అప్పుడు అలాంటి డెసిషన్ తీసుకోవడం వల్లే తనలో పరిణితి వచ్చి తనకు చేసే సినిమాలోని పాత్రలను అర్ధం చేసుకుని నటించగలుగుతున్నా అని.. ఒకవేళ లెక్కల క్లాస్ కి భయపడి అప్పట్లో సినిమాల్లోకి వస్తే.. తనకి ఇప్పుడున్నంత పరిణితి తనలో లేక పాత్రలను అర్ధం చేసుకోలేకపోయేదాన్ని అని చెబుతుంది. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో రానా తో విరాట పర్వం సినిమాలోనూ, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాలోనూ నటిస్తుంది.

Tags:    

Similar News