లీడర్ సినిమాకు భరత్ అనే నేనుకు పోలిక ఏంటి

Update: 2018-04-01 11:48 GMT

ఈనెల 20న ప్రేక్షకులని అలరించటానికి వస్తున్నాడు భరత్. ఇప్పటికే భరత్ అనే నేను రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. మిగిలిన సాంగ్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు మహేష్ బాబు ఉన్న పోస్టర్స్ రిలీజ్ చేసారు కానీ నిన్న హీరోయిన్ కైరా అద్వాని లుక్ రివీల్ చేస్తూ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ లో మహేష్ బాబు.. కైరా అద్వాని భుజంపై చేయి వేసి నడుచుకుంటూ వస్తుంటే వెనకాల సీఎం కాన్వాయ్ ఉంటుంది.

అయితే ఇప్పుడు ఈ పోస్టర్ కు లీడర్ సినిమాకు పోలిక పెడుతున్నారు సోషల్ మీడియాలో. లీడర్ సినిమాలో సిఎం పాత్రలో కనిపించే సినిమాలో రానా లీడర్ వచ్చింది. అందులో రానా మెయిన్ హీరొయిన్ రిచా గంగోపాధ్యాయ మధ్య కూడా ఇలాంటి బాడీ లాంగ్వేజే ఉంటుంది. అచ్చం అలానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

పోలిక రావడం సహజం కానీ అక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. ఈ సినిమాలో మహేష్ మాస్ హీరో కాదు చాలా కూల్ గా హుందాగా ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్య మంత్రి పాత్ర కాబట్టి సహజంగానే ఆ కాన్వాయ్ ఆర్భాటం ఎలా తీసినా ఇవన్ని ఉండాల్సిందే. సో కొరటాల ఇలా ప్రెజెంట్ చేయటం తప్ప మరొక్క ఆప్షన్ లేదు. రెండోసారి వీరి కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కాబ్బటి అంచనాలు మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి. సో ఇన్ని అంచనాలు ఉన్న సినిమాకు ఇటువంటి కామెంట్స్ కామనే.

Similar News