లావణ్య కూడా?

Update: 2017-10-23 11:00 GMT

ఈమధ్యన హీరోయిన్స్ అంతా ఒక పక్క సినిమాలు మరోపక్క వ్యాపారాలు అంటూ దూసుకుపోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ బిజినెస్ లో బిజీగా ఉండగా... ప్రణీత సుభాష్ లాంటివారు హోటల్ రంగంలో కాలుపెట్టారు. మరికొంతమంది కూడా ఇలా అనేకానేక వ్యాపారాల్లో ఆరితేరిపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్స్ లిస్ట్ లోకి మరో హీరోయిన్ కూడా చేరబోతోంది. వరుస ప్లాప్స్ తో కొట్టుకుపోతున్న లావణ్య త్రిపాఠి నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా విడుదలకు సిద్దముగా ఉంది. రామ్ హీరోగా లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' రేపు శుక్రవారం విడుదల కాబోతుంది.

'ఉన్నది ఒకటే జిందగీ 'విడుదల ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న లావణ్య త్రిపాఠి తాను వ్యాపార రంగంలో కూడా అడుగు పెట్టాలనుకుంటున్నట్లుగా చెబుతుంది. ఒకపక్కన సినిమాల్లో నటిస్తూ... మరోపక్క వ్యాపారం కూడా చేయాలనే కోరిక తనకు బలంగా వుందని చెబుతున్నది. అయితే వ్యాపారాన్ని ఎప్పుడు ప్రారంభించాలనే విషయంలో తనకు ఇంకా స్పష్టత లేదు అని చెబుతుంది. తనకు ఫిట్‌నెస్‌పై మంచి అవగాహన ఉంది..... అలాగే ఫుడ్ అంటే తనకు చాలా ఇష్టమని క్లూ ఇచ్చేసింది ఈ అమ్మడు. అంటే లావణ్య ఒకటి జిమ్ బిజినెస్ అయినా.. లేకుంటే రెస్టారెంట్ బిజినెస్ అయినా చెయ్యబోతుందనేది అమ్మడు మాటలను బట్టి అర్ధమవుతుంది.

మరి ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక ఖాళీ అవుతున్న ఈ భామ ఇలా ఎదో ఒక వ్యాపారంలో బిజీ అయితే మాత్రం బాగానే ఉంటుంది. లేకుంటే అటు సినిమాలు లేక.. ఇటు ఖాళీగా కూర్చోవాలంటే మాత్రం బోర్ కొట్టేస్తుంది. అందుకే కరెక్ట్ టైం లో అమ్మడు కరెక్ట్ నిర్ణయం తీసుకుందంటున్నారు.

Similar News