లాజిక్ బావుంది బాసు!!

Update: 2017-07-30 04:52 GMT

టాలీవుడ్ అయినా.. కోలీవుడ్ అయినా.. బాలీవుడ్ అయినా సినిమా కథలకు తగ్గట్టు హీరోలు తమ స్టైల్స్ ని, లుక్స్ ని మార్చేస్తుంటారు. ఈ విషయంలో బాలీవుడ్ హీరోలు ముందుంటారు. సినిమా కోసం టోటల్ లుక్ ని చేంజ్ చెయ్యడమే కాదు సినిమా కోసం ఏకంగా 50 నుండి 60 కిలోల బరువుపెరిగిపోయి మళ్ళీసినిమా పూర్తవ్వగానే యధావిధిగా తమ వెయిట్ ని ఫాలో అయిపోతుంటారు. ఇక ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా హీరోలు ఎలాంటి ప్రయోగానికైనా సిద్ధపడిపోతున్నారు. మొన్నటికి మొన్న రానా, ప్రభాస్ లు బాహుబలి కోసం కండలు పెంచేశారు. కానీ ఇపుడు తమ కొత్త సినిమాలకోసం యదావిధిగా ఫిట్నెస్ ని ఫాలో అవుతూ కండలు కరిగించేస్తున్నారు.

అయితే కోలీవుడ్ లో రజినీకాంత్ అల్లుడు, తమిళ స్టార్ హీరో అయిన ధనుష్ మాత్రం సినిమాల్లో హీరోగా అడుగుపెట్టినప్పటినుండి ఒకేలా కనబడుతూ హిట్స్ మీద హిట్స్ కొడుతూనే ఉన్నాడు. 30 సినిమాలలో హీరోగానటించిన ఎప్పుడూ కొత్త లుక్ కి ట్రై చెయ్యని ఈహీరోని మీరు కాస్త లావై కండలు పెంచితే బావంటుంది కదా అని అడగగా... దానికి ధనుష్ నా బాడీలో ఒక కమర్షియల్ హీరోకి ఉండవలిసిన లక్షణాలు లేవు. ఆ విషయం నాకు స్పష్టంగా తెలుసు. మరి అలాంటప్పుడు నా బాడీకి సెట్ అయ్యే పాత్రలనే ఎంచుకుంటాను గాని కొత్త పాత్రలు ఎంచుకుని కొత్తగా ఎలాంటి రిస్క్ తీసుకోను. నాకు కొన్ని బలాలు... బలహీనతలు ఉన్నాయి.

కానీ నేను ప్రభాస్ లా బాహుబలి కోసం కండలు పెంచలేను..... ఎందుకంటే నా శరీరమే నాకు బలమంటున్నాడు. మరి నిజంగానే ధనుష్ చెప్పిన విషయం కాస్త లాజికల్ గానే ఉందండి. ధనుష్ ని కండలు పెంచి ప్రభాస్ లా మారమంటే ఎలా చెప్పండి.... ఊహించుకోవడానికే కొంచెం ఇబ్బందిగా లేదు.

Similar News