లాక్ డౌన్ లోను సంపాదిస్తున్న హీరోయిన్స్?

కరోనా లాక్ డౌన్ లో హీరోయిన్స్ అంతా ఏ వంటలో, జిమ్ లోనో వర్కౌట్స్ చేస్తూ కాలం గడుపుతున్నారు. మరి సినిమా షూటింగ్స్ కి బ్రేకులు పడిన [more]

Update: 2020-05-20 04:32 GMT

కరోనా లాక్ డౌన్ లో హీరోయిన్స్ అంతా ఏ వంటలో, జిమ్ లోనో వర్కౌట్స్ చేస్తూ కాలం గడుపుతున్నారు. మరి సినిమా షూటింగ్స్ కి బ్రేకులు పడిన కారణంగా.. హీరోయిన్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. అయితే ఇద్దరు హీరోయిన్స్ మాత్రం ఈ కరోనా లాక్ డౌన్ టైం లోను సంపాదిస్తున్నారు. మరి షూటింగ్స్ లేకుండా ఖాళీగా ఉన్న హీరోయిన్స్ ఎలా సంపాదిస్తున్నారు అనుకుంటున్నారా… కాజల్ అగర్వాల్, తమన్నా ఇద్దరూ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తూ.. ఆదాయాన్ని పొందుతున్నారు.

సోషల్ మీడియా పేజెస్ లో ఈ ఇద్దరు హీరోయిన్స్  మొబైల్ బిల్ చెల్లింపు యాప్ అండ్ గేమ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ ఎప్పటికప్పుడు వీడియోస్ ని పోస్ట్ చేస్తున్నారు. ఎంపిఎల్ గేమ్స్ యాప్‌ను తమన్నా ప్రమోట్ చేస్తుంటే… భారత్ బిల్ పే యాప్‌ను కాజల్ ప్రమోట్ చేస్తుంది. ఇక తమన్నా రోజంతా ఖాళీగా ఉంది బోర్ కొడుతుంటే.. తానూ రోజు మొత్తంలో ఎంపిఎల్‌లో మొబైల్ గేమ్స్ ఆడతానని చెబుతూ ఆ గేమ్ ని ప్రమోట్ చేస్తుంది. ఇక ఇటు కాజల్, అటు తమన్నాలు ఇద్దరూ ఇలా యాప్స్ ని ప్రమోట్ చేస్తూ తెగ సంపాదిస్తున్నారు.

Tags:    

Similar News