లక్ష్మీ అందాలు ఏమాత్రం హెల్ప్ చేస్తుందో?

Update: 2017-10-04 08:22 GMT

లక్ష్మి రాయ్ జూలీ 2 తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి ఈ అక్టోబర్ ఆరునే రాబోతుంది. ఇప్పటివరకు స్పెషల్ కేరెక్టర్స్, ఐటెం సాంగ్ లకు ఫెమస్ అయిన లక్ష్మి రాయ్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది. మరి జూలీ 2 లో లక్ష్మి రాయ్ సినిమా మొత్తం అందాల ఆరబోతతో రెచ్చిపోవడానికి రెడీగా వుంది. ఇప్పటికే ట్రయిలర్, హాట్ హాట్ పిక్స్ తో అందరిని మైమరపిస్తున్న లక్ష్మి రాయ్ ఇప్పుడు... మరొక ట్రైలర్ లో అదిరిపోయే అందాలతో కనువిందు చేస్తుంది. ఇక వాటితోనే కాకుండా సినిమా మొత్తం అందాలు పరిచేసి ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది.

అయితే లక్ష్మి రాయ్ నటించిన ఈ జూలీ 2 సినిమా మొత్తం విద్యాబాలన్ హీరోయిన్ గా తెరకెక్కి సూపర్ హిట్ అయినా డర్టీ పిక్చర్ తో పోల్చడం చూసిన లక్ష్మి రాయ్, జూలీ 2 సినిమా కథ అంతా కొత్తగా ఉండబోతుందని... కథ ఊహించుకోవడానికి కూడా ఊహకందని కథ జూలీ 2 అంటూ ప్రమోషన్స్ లో ప్రగల్బాలు పలుకుతుంది. అంతేకాకుండా ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై ఇది చాలా కొత్తదనంతో కూడిన సినిమా అంటూ బిల్డప్ ఇస్తుంది. అలాగే ఈ సినిమా కోసం అంతలా కష్టపడ్డాను కాబట్టే..... సినిమా నుంచి నేను చాలా ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నా అంటూ దీర్గాలు తీస్తుంది.

మరి కేవలం హాట్ అందాలతోనే కాక లక్ష్మి రాయ్ నటన పరంగాను కొత్తగా ట్రై చేసిందనేది మాత్రం కొద్దిగా అర్ధమయినప్పటికీ... ఇప్పటివరకు సౌత్ లో సక్సెస్ కాలేని ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో ఏ మాత్రం చక్రం తిప్పుతుందో అనేది మాత్రం మరొక్క రోజులోనే తెలిసిపోతుంది.

Similar News