రోమన్ అంకెలతో విడుదల తేదీ ప్రకటన

Update: 2016-11-14 13:50 GMT

చారిత్రాత్మక కథలను తెరకెక్కించటంలో అద్భుతమైన నేర్పు కనబరచగలడని బాజీరావు మస్తానీ తో రుజువు చేసుకున్నాడు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీల బన్సాలి. ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం పద్మావతి. దీపికా పదుకొనె టైటిల్ రోల్ పోషిస్తున్నారు. రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ లు పద్మావతి చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రకటించిన నాటి నుంచి అంచనాలు అధికంగానే వున్నాయి. సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో రాంలీలా గోలియోమ్కి రాసలీల, బాజీరావ్ మస్తానీ వంటి రెండు వరుస భారీ సంచలన విజయాల తరువాత రణవీర్ సింగ్, దీపికా పదుకొనె, సంజయ్ లీల బన్సాలి ల కలియకలో వస్తున్న చిత్రం కావటం ఇందుకు కారణం.

పద్మావతి చిత్రం లో పద్మావతి భర్త రాజా రావల్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ కనిపించనున్నారు. ప్రతినాయకుడు పాత్ర ఐన ఖిల్జీ రాజ వంశపు రెండవ రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రానికి నిర్మాణాంతర కార్యక్రమాలకు అధిక సమయం కేటాయించనున్నారు. అందుకే మరో ఏడాది తరువాత చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు నిర్మాతలు. రణవీర్ సింగ్ కళ్ళల్లో రౌద్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న కేవలం అతగాడి కళ్ళు మాత్రమే కనిపించే పోస్టర్ ను విడుదల చేస్తూ ఆ పోస్టర్ పై రోమన్ అంకెలలో ముద్రించి విడుదల చేసారు.

ఆ రోమన్ అంకెల సారాంశం పద్మావతి చిత్ర విడుదల తేదీ ప్రకటించటమే అంట. 17.11.2017 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Similar News