రోబో 2.0 లో మెగాస్టార్ గెస్ట్ రోల్ ?

Update: 2016-11-25 16:52 GMT

రజినీకాంత్ - డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మరో సంచలన చిత్రం 'రోబో 2 .0 ' . ఈ చిత్రం గురించి ఏ న్యూస్ వెలువడినా అదొక పెద్ద సంచలనంలా చెప్పేసుకుంటున్నారు సినీ ప్రియులు. అసలు ఈ సినిమా మొదలైనప్పటినుండి ఈ సినిమాపై పిచ్చ క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ ఎంత గొప్పగా జరిగిందో అందరూ చూసారు. అసలు ఈ ఈవెంట్ కే భారీ మొత్తం లో ఖర్చు చేశారనే ప్రచారం కూడా జరిగింది. ఈ' రోబో 2 .0 ' ఒకేసారి తెలుగు, తమిళ్, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నాడు. డైరెక్టర్ శంకర్. ఇప్పటికే సంచలనాలకు కేంద్రం గా మారిన ఈ చిత్రం గురుంచి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేమిటంటే రజినీకాంత్ 'రోబో 2 .0 ' లో ఒక టాలీవుడ్ టాప్ స్టార్ మెరవబోతున్నాడట. ఆ టాప్ హీరో ఎవరా? అని అప్పుడే అందరూ తెగ చర్చించేసుకుంటున్నారట.

'రోబో 2 .౦ ' లో నటించే ఆ టాలీవుడ్ స్టార్ ఎవరంటే చాలా సంవత్సరాల తర్వాత మొహానికి మేకప్ వేసుకుని ఇప్పుడు తన 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ ౧౫౦ ' లో నటిస్తున్న చిరు అంట. మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ 'రోబో 2 .0 ' లో చిరంజీవి నటిస్తాడని మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే చిరు ఎప్పటినుండో శంకర్ డైరెక్షన్ లో నటించాలనుకుంటున్నాడట. ఈ విషయమే శంకర్ ని డైరెక్ట్ కూడా అడిగాడట. అయితే శంకర్ అప్పుడు బిజీగా ఉండడం తో చిరు తో సినిమా చెయ్యలేక పోయాడనే ప్రచారం జరిగింది. అందుకే ఈ 'రోబో 2 .0 ' లో చిరు గెస్ట్ రోల్ లో చెయ్యడానికి శంకర్ ఒప్పించాడని అంటున్నారు. మరి చిరు అయితే 'రోబో 2 .0 ' లో క్యామియో రోల్ లో నటిస్తున్నాడని అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు వెలువడలేదు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం వేసవిలో విడుదల చెయ్యాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.

Similar News