రెహమాన్ చిరు కి హ్యాండ్ ఇచ్చి?

Update: 2017-11-30 14:00 GMT

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏ ఆర్ రెహమాన్ చిరంజీవి 151 వ చిత్రం 'సై రా నరసింహారెడ్డి' నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. అయితే రెహమాన్ సొంతంగా ఒక సినిమా ని డైరెక్ట్ చేస్తున్నందుకే ఈ 'సై రా' నుంచి తప్పుకున్నట్టు చెప్పుకొచ్చాడు. కాని ఇక్కడ జరుగున్నది వేరుగా వుంది. అసలు రెహమాన్ కావాలనే 'సై రా' నుండి తప్పుకున్నాడా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలిగేలా ఉంది రెహమాన్ చేసే పనులు చూస్తుంటే. తన స్వీయ దర్శకత్వం లో వచ్చే సినిమా తో పాటు పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే చేస్తున్నాడు రెహమాన్.

ఇప్పటికే మణిరత్నం సినిమా ని ఓకే చేసిన రెహమాన్ ఇప్పుడు తాజాగా ఒక మలయాళ సినిమాకు కూడా ఓకే చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. పృథ్వీరాజ్ హీరోగా తెరకెక్కనున్న 'ఆడుజీవితం' అనే సినిమాకు రెహమాన్ పని చేయనున్నాడట. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారట చిత్ర బృందం. మరి మొన్నటి వరకు తన సొంత సినిమా తో బిజీ గా ఉన్నాను…. వేరే ప్రాజెక్ట్స్ ఏవి ఓకే చెయ్యను అని చెప్పిన రెహమాన్ సడన్ గా 'సై రా' కి హ్యాండ్ ఇచ్చేసాడు.

మరి ఇప్పుడు చిరు 'సై రా' ని కాదని ఈ మలయాళం ప్రాజెక్ట్ ను ఎందుకు ఒప్పుకున్నాడు అని ప్రశ్నిస్తున్నారు మెగా ఫాన్స్. మరి అంత బిజీ గా ఉన్నప్పుడు ఏ ప్రాజెక్ట్ ని ఒప్పుకోకూడదు. కానీ అన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటూ 'సై రా' మాత్రం లైట్ తీసుకున్నాడంటూ రెహమాన్ పై ఫైర్ అవుతున్నారు మెగా ఫాన్స్. మరి దీన్ని బట్టి చూస్తుంటే బిజీ షెడ్యూల్ ఒక కారణమే కాదు.... రెహమాన్ 'సై రా'ని వదులుకోవడానికి... నిజంగా బయట ప్రచారం జరిగినట్టుగానే.. రెహమాన్ అడిగిన పారితోషకం ఇవ్వడానికి చరణ్ ఒప్పుకోలేదా? అసలు రెహమాన్ ని సంప్రదించకుండానే.. రెహమాన్ పేరు 'సై రా' మోషన్ పోస్టర్ లో వేసారా? ఏమో రెహమాన్ 'సై రా' నుండి తప్పుకోవడానికి గట్టి కారణం ఏదో ఒకటి ఉండి ఉంటుంది అనే అనుమానం ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది.

Similar News