రూమర్ పై క్లారిటీ ఇచ్చిన అనసూయ

Update: 2018-04-16 10:00 GMT

లేటెస్ట్ గా వచ్చిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గురించి కాకుండా మరో పాత్ర గురించి కూడా అంత మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం లో రంగమ్మత్తగా అనసూయ అద్భుతమైన నటనను కనబరిచిన విషయం తెలిసిందే. తన పాత్రకి వచ్చిన పేరుకు అనసూయ బాగా మురిసిపోతుంది

ఈ పాత్ర చేసినందుకు చాలా గర్వంగా ఉందని చెబుతుంది. ఇక అనసూయ మరో మూవీ ‘సచ్చిందిరా గొర్రె’ విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ చరణ్ తో నటించటమే కాకుండా తన తండ్రి మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కూడా ఓ కీలకపాత్రలో నటిస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

అయితే లేటెస్ట్ గా జరిగిన ఓ కార్యక్రమంలో అనసూయ ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చింది. ‘‘సైరాలో నటించమని చిత్రయూనిట్ నుంచి తనని ఎవరూ కలవలేదని, ఒకవేళ నిజంగా తనని నటించమని అడిగితే మాత్రం తప్పకుండా చేస్తానని తెలిపింది. అంత గొప్ప చిత్రంలో ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా అని ఆన్సర్ ఇచ్చింది.

Similar News