రివ్యూస్ పై చాలా ప్రాక్టీకల్ గా స్పందించిన సురేష్ బాబు

Update: 2017-04-19 12:42 GMT

ఎన్నో నెలలు శ్రమించి చేస్తున్న సినిమాలకి సినిమా పూర్తి స్థాయిలో విడుదల కాకముందే ప్రీమియర్ షోస్ చూసేసి వాటిని విశ్లేషించి పూర్తి కథ, కథనాలను బైటకి రివీల్ చేసేస్తున్నాయంటూ వెబ్సైట్లు రాస్తున్న రివ్యూస్ ని తప్పుబడుతూ వాటిని సినిమా విడుదలైన తొలి వారాంతం వరకు హోల్డ్ లో ఉంచి అనంతరం పబ్లిష్ చేయాలని లేకపోతే ఈ రివ్యూ ల ప్రభావంతో దెబ్బతింటున్న బాక్స్ ఆఫీస్ వసూళ్ల కారణంగా నిర్మాతలు ఎదుర్కొంటున్న నష్టాల నుంచి బైట పడే ఆస్కారం ఉండబోదని ఎందరో ప్రముఖ నిర్మాతలతో పాటు హీరోలు కూడా అభిప్రాయం పడ్డారు. వారిలో సూపర్ స్టార్ రజని కాంత్ కూడా ఉండటం గమనార్హం.

అగ్ర కథానాయకులు నటించిన సినిమాలకి విడుదల ముందుగానే తొలి వీకెండ్ కి టికెట్స్ బుక్ అయిపోతుండటం తో తొలి ఆట తరువాత ప్రచురితమయ్యే రివ్యూస్ వల్ల పెద్దగా ప్రభావం ఉండబోదని, ఈ రివ్యూస్ కేవలం చిన్న సినిమాలపై ప్రభావం చూపుతుంటాయని, అందుకే విడుదలకి ముందు భారీ క్రేజీ ప్రాజెక్ట్స్ కాని పెళ్లి చూపులు, ఘాజి చిత్రాలు ఊహించని స్థాయిలో సక్సెస్ అవ్వటానికి రివ్యూస్ కారణం అని అభిప్రాయ పడ్డారు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు. మంచి సినిమాని నెగటివ్ రేటింగ్స్ నియంత్రించలేవని, అలానే చేత సినిమాని పాజిటివ్ రేటింగ్స్ సక్సెస్ దిశగా నడపలేవని తేల్చి చెప్పిన సురేష్ బాబు తొలి వారాంతం వరకు విశ్లేషణలు ఆపటం సాధ్యపడే విషయం కాదని వ్యక్తం చేశారు.

Similar News