రిలీజ్ సాహసం వెనుక సీక్రెట్ ఇదే

Update: 2016-11-17 13:02 GMT

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా రేపు నవంబర్ 18 న విడుదలకు సిద్ధమైంది. మోడీ పెద్ద నోట్ల రద్దు కి ఏమాత్రం భయపడకుండా ఈ సినిమాని విడుదల చెయ్యడానికి నిఖిల్ సిద్ధమయ్యాడు. ఇంతకుముందు నాగ చైతన్య కూడా మోడీ దెబ్బకి భయపడకుండా సాహసం శ్వాసగా సాగిపో సినిమాని విడుదల చేసి దమ్ము చూపించాడు. నాగ చైతన్యలాగే నిఖిల్ కూడా తన సినిమాని ధైర్యంగా విడుదల చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ట్రయిలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. మొదటి లుక్ నుండే అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ఎక్కడికి పోతావు చిన్నవాడా... ఈ ట్రైలర్ తో తన సత్తా చాటిందనే చెప్పాలి. అందుకే ఈ సినిమాని ధైర్యం గా విడుదల చెయ్యడానికిసిద్ధపడ్డారని ఈ ట్రైలర్ చూసిన వాళ్లకి అర్ధమవుతుంది.

అసలు ఆత్మలంటేనే నమ్మకం లేని కుర్రాడుని ఒక ఆత్మ వెంటాడడం... ఆత్మ నుండి తప్పించుకునేందుకు మహిషాసుర మర్ధిని గుడికి వెళ్లమని ఆతనికి ఓ మాంత్రికుడు చెప్పడం.... ఆత్మనుండి తప్పించుకుని ప్రాణాల కోసం పరిగెత్తడం... తాను అందరిలాంటి అమ్మాయిని కానని .. ఆత్మననే అర్థంలో ఓ హీరోయిన్ చెప్పడం వంటి విషయాలు ఆశక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ తోనే సినిమా పై అంచనాలు పెంచేశారు. ఇక ఈ సినిమా విడుదలై థెటర్స్ లో ప్రభంజనం సృష్టించడమే మిగిలింది. ఇక ఈ సినిమాలో నిఖిల్ కి జంటగా హేబా పటేల్, నందిత నటిస్తున్నారు.

Similar News