రిలీజ్ కు ముందే సంచలనాలు!

Update: 2016-04-02 23:23 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్ ప్యాక్డ్ మూవీ స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఇంకా రిలీజ్ కాకుండానే సెన్సేష‌న్ సృష్టిస్తున్నాడు. ఈ సినిమాకి అప్పుడే అడ్వాన్స్ బుకింగ్ మొద‌లైపోయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా స‌ర్దార్ 42 దేశాల్లో రిలీజ్ కాబోతోంది. ఆస్ట్రేలియా లోని సిడ్నీలో అప్పుడే ఒక థియేట‌ర్ ద‌గ్గ‌ర రెండు రోజుల క్రితమే బుకింగ్ క్లోజ్ అయిపోయింది.ఇక బెంగ‌ళూరు, చెన్నై, హైద్రాబాద్, వైజాగ్., విజ‌య‌వాడ లాంటి న‌గరాల్లో శుక్ర‌వారానికి చాలా థియేట‌ర్స్ లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. బుకింగ్ ఓపెన్ చేసిన నిమిషాల వ్య‌వధి లోనే వెబ్ సైట్స్ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు క్లోజ్ అయిపోయాయి. దొరికిన వాళ్లు ఆనందంతో గంతులేస్తుండగా..దొరకని వాళ్లు ఇతర మార్గాల్లో టికెట్ల కోసం వేట మొదలెట్టారు.శుక్ర‌వారం సాయంత్రం తొలిరోజు నాలుగు షోల‌కు థియేట‌ర్స్ వ‌ద్ద హౌస్ ఫుల్ బోర్డ్స్ ద‌ర్శ‌నమిచ్చాయి. దీంతో స‌ర్దార్.. బాహుబ‌లి రికార్డు ను బీట్ చేయ‌డం ఖాయ‌మ‌నే టాక్ న‌డుస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఎక్క‌డ చూసినా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ప్ర‌భంజ‌న‌మే క‌నిపిస్తోంది. ఓవ‌ర్సీస్ లోని షోస్ కోసం ఇప్ప‌టినుంచే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనినిబట్టి చూస్తే ఏ మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ క‌లెక్ష‌న్ల సునామీయే అన్న‌మాట‌.

Similar News