రానా మరో ప్రయోగం

Update: 2017-11-30 16:00 GMT

కెరీర్ లో ఇప్పటి వరకు నటించిన చిత్రాలు అన్నింటిలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న రానా దగ్గుబాటి తన తదుపరి చిత్రాలు కూడా వేటికవే విభిన్నమైనవిగా ఉండేటట్లు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘1945’ అనే పీరియడ్ చిత్రంలో నటిస్తున్న రానా.. ఆ తరువాత ట్రావంకోర్ సంస్థాన మొదటి రాజు మార్తాండ వర్మ జీవితకథలో నటిస్తున్నాడు. తాజాగా రానా నటించబోయే మరో చిత్రం కూడా ప్రకటించేశాడు.

1971లో హిందీలో తెరకెక్కిన ‘హాతి మేరె సాతి’ చిత్రం ఆధారంగా తెరకెక్కబోతున్న చిత్రంలో రానా నటించనున్నాడు. ఈ చిత్రం మూడు భాషల్లో తెరకెక్కనుందని సమాచారం. తమిళ దర్శకుడు ప్రభు సోలొమన్ ఈ చిత్రంతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ చిత్రం గురుంచి రానా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించాడు. 2018 జనవరి నుండి ఈ చిత్రం చిత్రీకరణ మొదలు కానుందని తెలిపాడు రానా.

2018 సంవత్సరం దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని సమాచారం. భారత్ – థాయిలాండ్ దేశాల్లో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకోనుంది

Similar News