రాజు గారు మెగా స్టార్ ని కలిసి మరీ అభినందించారట

Update: 2017-01-21 12:00 GMT

ఈ నెల 11 న విడుదలైన మెగా స్టార్ ప్రతిష్టాత్మక 150 వ చిత్రం ఖైదీ నెం.150 తెలుగు సినిమా రికార్డ్స్ అన్నీ దాటుకుంటూ ఇప్పటికే చాలా ప్రాంతాలలో నాన్ బాహుబలి రికార్డు గా నిలిచింది. ఈ చిత్రం ఇంతటి భారీ వసూళ్లు రాబడుతున్నప్పటికీ ఖైదీ నెం.౧౫౦ విడుదలైన ఒకటి నుంచి మూడు రోజుల వ్యవధిలో విడుదలైన గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు కూడా విజయం సాధించాయి. శతమానం భవతి చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సినిమా ఫలితంపై ఏ మాత్రం బెంగ లేకుండా ఖైదీ నెం.150 విడుదలైన మూడవ రోజు కి తన చిత్రం కోసం నైజామ్ ప్రాంతంలో బుక్ చేసుకున్న థియేటర్లలో 20 థియేటర్లు త్యాగం చేసి మరీ పండుగ మూడు రోజులు చిరు సినిమా కి నైజాం ప్రాంతంలో తిరుగు లేని కలెక్షన్లు రావటానికి సహకరించాడు దిల్ రాజు.

సంక్రాంతి పండుగకి విడుదలైన ఖైదీ నెం.150 తో పాటు గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు భారీ విజయాలు సాధించగా దిల్ రాజు ఫోకస్ మెగా స్టార్ తదుపరి చిత్రాల పై పడింది. చిరు కం బ్యాక్ సినిమా భారీ విజయానికి తన వంతుగా తన వద్ద వున్న థియేటర్లు త్యాగం చేసిన దిల్ రాజు ఇప్పుడు మెగా ఆఫర్తో ప్రతిఫలం పొందటానికి తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఖైదీ నెం.150 సూపర్ సక్సెస్ సాధించటంతో మెగా స్టార్ చిరంజీవిని కలిసి అభినందనలు తెలిపిన దిల్ రాజు అనంతరం మెగా స్టార్ తో సినిమా తీయాలన్న తన కోరికను బైట పెట్టాడు. అయితే ఇది వెనువెంటనే సాధ్యపడే ప్రాజెక్ట్ కాదు. చిరు కి సరిపోయే ప్రామిసింగ్ స్క్రిప్ట్ కుదిరినప్పుడే ఆయనని అప్ప్రోచ్ అవుతానని చెప్తున్నాడు రాజు. పవర్ స్టార్ తో సినిమా తీయాలని చాలా కాలం నుంచి దిల్ రాజు చేసిన ప్రయత్నాలు విఫలం కావటంతో ఇప్పుడు మెగా స్టార్ రీ ఎంట్రీ గ్రాండ్ సక్సెస్ కావటంతో చిరు తో సినిమా తీయటానికి స్క్రిప్ట్ అన్వేషణలో పడిపోయినట్టున్నాడు నిర్మాత దిల్ రాజు.

Similar News