రాజమౌళి మీద కన్నేసిన బాలీవుడ్ హీరో

Update: 2017-10-02 12:00 GMT

రాజమౌళి మహాభారతం ప్రాజెక్ట్ ని ఎప్పుడు మొదలు పెడతాడో క్లారిటీ లేదుగాని అందులో నటించాలని తహ తహ లాడే హీరోల సంఖ్యా రోజు రోజుకి పెరిగిపోతుంది. మ‌హాభార‌త దృశ్య కావ్యాన్ని తెరకెక్కించాలన్నది త‌న‌ డ్రీమ్ అని చెప్పడమే కాదు... క‌చ్ఛితంగా దానిని తెరకెక్కిస్తానని కూడా రాజమౌళి చెబుతున్నాడు కానీ..... ఎప్పుడనేది చెప్పకుండా సమాధానం దాటవేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, జక్కన్న మహాభారతం లో ఎలాంటి పాత్ర ఇచ్చినా చెయ్యడానికి సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ టాప్ హీరో కూడా రాజమౌళి మహాభారతంలో నటించాలని ముచ్చటపడుతున్నాడు. కేవలం ముచ్చట పడడమేకాదు ఓపెన్ గా రాజమౌళి తెరకెక్కించబోయే మహాభారతంలో కృష్ణుడు పాత్ర కావాలని అడుగుతున్నాడు. ఆ టాప్ హీరో ఎవరో కాదు అమీర్ ఖాన్. అమీరా ఖాన్ తనకి రాజమౌళి అంటే చాలా ఇష్టమని... రాజమౌళి ఒక సినిమాని తెరకెక్కించడానికి చాలా కష్టపడతాడని అంటున్నాడు. ఇదంతా అమీర్ ఖాన్ తాను నటించిన సూపర్‌ స్టార్‌ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో పంచుకున్నాడు. ఇంకా అమీర్, రాజమౌళి ని అంకిత‌భావం గ‌ల ద‌ర్శ‌కుడ‌ని... అలాంటి దర్శకుడు ఒకవేళ మహాభారతం తీస్తే అందులో తనకు కృష్ణుడి పాత్ర లేదంటే కర్ణుడి పాత్ర ఇవ్వమని కోరతాన‌ని చెబుతున్నాడు.

అయితే ఆమీర్ ఖాన్.. తనకు కృష్ణుడి పాత్రే సరిగ్గా సూట్ అవుతుంద‌ని అంటున్నాడు. మరి ఇంతిలా ముచ్చటపడుతున్న ఆ బాలీవుడ్ హీరో కోరిక రాజమౌళి నెరవేరుస్తాడో లేదో తెలియదు గాని... ఇంకా అమీర్ మాత్రం దక్షిణాది నుండి కథలు వస్తే మాత్రం ఖచ్చితంగా నటిస్తానని .... అలాగే తెలుగు భాషలో చిరు, పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వస్తే అస్సలు అవదులుకోనని చెబుతున్నాడు. మరి ఈ లెక్కన అమీర్ ఖాన్, రాజమౌళి మీద గట్టిగానే కన్నేశాడన్నమాట.

Similar News