రాజమౌళి నెక్స్ట్ పై క్లారిటీ!!

Update: 2017-11-15 17:00 GMT

ఇప్పుడు దేశంలోని సినిమా ప్రియులు మొత్తం రాజమౌళి తదుపరి సినిమాఏంటి? అసలు ఏ హీరోతో సినిమా తియ్యబోతున్నాడు? అని ఆలోచిస్తున్నారు. బాహుబలి 2 రిలీజ్ అయ్యి కొన్ని నెలలు గడుస్తున్నా రాజమౌళి తన నెక్స్ట్ సినిమా ని ఇంత వరకు ప్రకటించలేదు. బాహుబలి తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మొదలెడతాడేమో... అయితే రాజమౌళి నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడకపోయే సరికి చాలా మంది తెలుగు ప్రేక్షకులు మాత్రం బాగా ఫీల్ అవుతున్నారు.

కథను ఫైనల్ చేసే పనిలో...

అయితే తాజాగా రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించిన ఒక చిన్న లీక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే రాజమౌళి బాహుబలి తర్వాత సినిమాని డి.వి.వి దానయ్య బ్యానర్ లో చేయబోతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే దానయ్య కాంపౌండ్ నుంచి అనధికారికంగా సినిమా గురించి కొన్ని అప్ డేట్స్ లీక్ అయ్యాయి. ఇటీవలే దానయ్య సన్నిహితుల వద్ద రాజమౌళి సినిమా గురించి మాట్లాడుతూ.... ప్రస్తుతం రాజమౌళి మరియు అయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ లు ఇద్దరు కలిసి కథను ఫైనల్ చేసే పనిలో ఉన్నారని..... త్వరలోనే కథ ఫైనల్ అవుతుందని చెప్పుకొచ్చాడనే టాక్ నడుస్తుంది.

నటీనటుల ఎంపిక?

ఇకపోతే కథ ఫైనల్ అవ్వగానే సినిమాకి సంబందించిన వర్క్ స్టార్ట్ చేస్తారు అని...... అది అయిపోగానే నటీనటుల ఎంపిక చేస్తారని..... 2018 జనవరిలో ఈ సినిమాని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకొచ్చాడట దానయ్య. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గాని.... ఇప్పుడు ఈ రూమర్ మాత్రం ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

Similar News