రాజమౌళి దాచిన ప్రభాస్ సీక్రెట్ బయటపడిపోయింది!

Update: 2016-10-02 05:14 GMT

ప్రభాస్ గురించి అక్టోబర్ 5 న ఒక గుడ్ న్యూస్ ని అందరికి చెప్తానని రాజమౌళి అందరికి ఒక సస్పెన్సు క్రియేట్ చేసాడు. అయితే ఆ సస్పెన్స్ ఏమిటనేది అక్టోబర్ 1 వ తేదీనే రివీల్ అయిపొయింది. సస్పెన్స్ వీడిపోయింది. ఇక రాజమౌళి చెబ్దామనుకున్న ఆ న్యూస్ బయటికొచ్చేసింది.

బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ రేంజ్ ప్రపంచానికి పరిచయమైంది. అటు బాలీవుడ్ లో కూడా ప్రభాస్ పిచ్చ క్రేజ్ సంపాదించాడు. బాహుబలి లో ప్రభాస్ నటనకు అతని ఒక అరుదైన ఘనత, గౌరవం దక్కబోతున్నాయి. అదేమిటంటే ప్రపంచం లోని ప్రముఖలకు మాత్రమే చోటున్న ప్రపంచప్రఖ్యాతి గాంచిన మేడం టుస్సాడ్ మ్యూజియం లో ప్రభాస్ మైనపు ప్రతిమ పెట్టడానికి వారు సర్వం సిద్ధం చేస్తున్నారు. భారత దేశ ప్రధాని నరేద్రమోడీ తరువాత ఈ ఘనత సాధించిన మూడో భారతీయుడు గా ప్రభాస్ ఈ గౌరవం దక్కబోతోంది. ఈ మైనపు ప్రతిమ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మార్చ్ 2017 నుండి ప్రత్యేకమైన ఆకర్షణ గా నిలవబోతోంది. ఇప్పటికే ప్రభాస్ కొలతలు తీసుకోవడానికి టుస్సాడ్ మ్యూజియం వారు హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం.

మేడం టుస్సాడ్ మ్యూజియం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభాస్ 2015 లో గూగుల్ సెర్చ్ ఇంజన్ లో అత్యధికంగా వెతికిన వ్యక్తుల్లో ఒకరు. ప్రభాస్ ప్రతిమని టుస్సాడ్ మ్యూజియం లో ఉంచాలని కోరుతూ ఆయన అభిమానులనుంచి మాకు అభ్యర్థనలు అందాయి అని అన్నారు.ఇక దీని గురించి ప్రభాస్ మాట్లాడుతూ మేడం టుస్సాడ్ మ్యూజియం లో స్థానం దక్కడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. అభిమానులవల్లే నాకు ఇది సాధ్యమైందని ప్రభాస్ సంతోషం గా తెలపడం విశేషం. ఈసందర్భంగా రాజమౌళికి కూడా ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపాడు. తనకి బాహుబలితో ప్రపంచ స్థాయి గుర్తింపునిచ్చి ఇంతటి గౌరవం వచ్చేలా చేసిన డైరెక్టర్ గారికి థాంక్స్ చెప్పాడు.

Similar News