రవితేజ ముందే స్టైల్ కొడుతున్నాడట

Update: 2017-10-24 10:00 GMT

రవితేజ లాంగ్ గ్యాప్ తీసుకుని 'రాజా ది గ్రేట్' తో కావాల్సిన హిట్ అందుకున్నాడు. గత వారం విడుదలైన 'రాజా ది గ్రేట్' సినిమా విడుదలైన అని చోట్లా మిక్స్డ్ టాక్ తో కలెక్షన్స్ వర్షంకురిపిస్తుంది. మెహ్రీన్ కౌర్ - రవితేజ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ తొలిసారి అంధుడి గా కనబడ్డాడు. అంధుడిగా రవితేజ నటనకు ఫుల్ మార్కులే పడ్డాయి. మాంచి ఎనర్జీతో రవితేజ ఎప్పటిలాగే అదరగొట్టేసాడు. 'కిక్ 2 , బెంగాల్ టైగర్' వంటి చిత్రాల తర్వాత రవితేజ 'రాజా ది గ్రేట్' తో మంచి హిట్ అందుకున్నాడు.

అయితే ఈ హిట్ సినిమాలో రవితేజ తన కొడుకు మహాధన్ ని తెలుగు తెరకి పరిచయం చేసాడు. 'రాజా ది గ్రేట్' లో రవితేజ చిన్ననాటి పాత్రని రవితేజ కొడుకు మహాధన్ పోషించి మెప్పించాడు. మొదటిసారి స్క్రీన్ మీద కనబడుతున్న ఎటువంటి ఎదురు బెదురూ లేకుండా నటించిన మహాధన్ అందరి ప్రశంశలు అందుకున్నాడు. మహాధన్ కి ఈ సినిమాతో మంచి పేరు రావడంతో రవితేజ చాలా ఆనంద పడిపోతున్నాడు. ఇదే విషయాన్ని రవితేజ.... 'రాజా ది గ్రేట్' మూవీ హిట్ కావడం చిత్ర బృందానికంతటికి సంతోషాన్ని ఇచ్చింది. మరి కష్టానికి తగిన సక్సెస్ వస్తే ఇలాగే ఉంటుంది. ఈ సినిమాలో నా చిన్నప్పటి పాత్రలో కనబడిన మా అబ్బాయి ఫోన్ కు చాలా మెసేజ్ లు వస్తున్నాయి. ఎందరో మా వాడిని అభినందింస్తున్నారు.

ఆ ఫోన్ కాల్స్ అవి చూసి వాడు చాలా ఆనందపడిపోతున్నాడు. చివరికి నా ముందే స్టైల్ కొట్టేస్తున్నాడు అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

Similar News