రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు..

Update: 2016-12-31 16:31 GMT

'ఖైదీ నెంబర్ 150 ' సాంగ్స్ ఒక్కొక్కటి మార్కెట్ లోకి వచ్చి ఉర్రూతలూగించేస్తున్నాయి. ఆడియో వేడుక గ్రాండ్ గా లేకపోతేనేమి సాంగ్స్ మాత్రం సింపుల్ గా మార్కెట్లోకి విడుదలై సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి. గత వారం రోజులుగా 'ఖైదీ...' సాంగ్స్ ఒక్కొక్కటిగా వచ్చి ఫ్యాన్స్ తో పాటు మిగతా ప్రేక్షకులను కూడా కట్టిపడేశాయి. దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన 'ఖైదీ...' మ్యూజిక్ కి అదిరిపోయే రెస్పాన్ వస్తుంది. ఇప్పటివరకు చిరంజీవి, కాజల్ అగర్వాల్ డాన్స్ చేసిన ఆడియో సాంగ్స్ ని విడుదలచేయగా తాజాగా ఇప్పుడు 'ఖైదీ...' ఐటెం సాంగ్ ని వదిలారు. 'రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు.. నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు' అంటూ సాగే ఈ సాంగ్ కి అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు దేవిశ్రీ. అసలు దేవిశ్రీ ప్రసాద్ ఐటెం సాంగ్స్ కి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి మ్యూజిక్ అందిస్తాడని మరోసారి రుజువైంది.

ఇక 'రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు.. నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు' సన్గ్ యువతను విపరీతం గా ఆకట్టుకుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాగే ఈ సాంగ్ లో లక్ష్మి రాయ్ డాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని సోషల్ మీడియాలో లీకైన లక్ష్మి రాయ్ పిక్చర్స్ ని బట్టి అర్ధమైపోయింది. ఇక ఈ పాటలో చిరంజీవి అదిరిపోయే స్టెప్స్ వేసాడని.... అసలు ఈ సాంగ్ చిరు డాన్స్ కోసమే పెట్టారా అన్నట్టు ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ తో ఉర్రూతలూగుతున్న యువత, మెగా ఫ్యాన్స్ ఇక ఐటెం సాంగ్ తో పిచ్చెక్కిపోయి పండగ చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇక ఆడియో సాంగ్స్ కె ఇంత రెస్పాన్స్ వస్తే వీడియో ప్రోమోస్ వదిలితే ఆమ్మో ఇక మెగా ఫ్యాన్స్ ని పట్టుకోవడం ఎవరివల్ల కాదేమో!!. ఇక 'ఖైదీ నెంబర్ 150 ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని నిర్మాత రామ్ చరణ్ భారీ లెవల్లో జనవరి 4 న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం లో జరిపిస్తున్న విషయం తెలిసిందే.

Similar News