రజిని అంటే వీజీ కాదురా?

Update: 2018-03-05 13:17 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ కి వయసు మీదపడుతున్న ఆయనకున్న క్రేజ్ ఏం మాత్రం తగ్గడం లేదు. రజినీకాంత్ కి వరుస ప్లాప్స్ ఉన్నా కూడా ఆయన సినిమా ఫస్ట్ లుక్ కి గాని, ఆ సినిమా టీజర్ కి గాని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. రజిని సినిమాలంటే చెవికోసుకునే సౌత్ ప్రేక్షకులు కోకొల్లలు. మరి కబాలి వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన రంజిత్ పా తో రజినీకాంత్ మళ్ళీ కాలా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పై మొదట్లో పెద్దగా అంచనాలు లేకపోయినా కాలా రజినీకాంత్ లుక్ బయటికి రాగానే దానిపై అంచనాలు తార స్థాయికి చేరాయి.

నిన్నగాక మొన్న కాలా టీజర్ ని విడుదల చేస్తే మళ్ళీ దర్శకుడు రంజిత్ పా కబాలి 2 తీస్తున్నాడా? అనే అనుమాల్ని వ్యక్తం చేశారు క్రిటిక్స్. ఎవరేమనుకున్నా కాలా పవర్ ఇప్పుడు అర్ధమవుతుంది. కాలా విడుదలైన 3 రోజుల్లోనే 2 కోట్ల వ్యూవ్స్ సాధించింది. కాలా టీజర్ మార్చి 2న విడుదల చెయ్యగా.... విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డు వ్యూవ్స్ సాధించింది. ఇక కాలా టీజర్ లో రజినీకాంత్ చెప్పిన డైలాగ్స్ హైలెట్ గా వున్నాయి. టీజర్‌లో... నలుపు శ్రమ జీవుల వర్ణం.. మా వాడకొచ్చి చూడు మురికంతా ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది.... క్యారే సెట్టింగా.. వీరయ్య బిడ్డన్రా.. ఒక్కడ్నే ఉన్నా.. దిల్లుంటే గుంపుగా రండ్రా... అంటూ చెప్పిన డైలాగ్స్ కి అందరూ పడిపోతున్నారు.

మరి రజిని గత చిత్రాల ప్లాప్స్ తో సంబంధం లేకుండా రజిని ఫ్యూచర్ చిత్రాలు ఇలా రికార్డులు సాధించేస్తూ రజిని స్టామినాని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాయి.

Similar News