రకుల్ కి అదే ప్రపంచం

ప్రస్తుతం తమిళ, బాలీవుడ్ సినిమాల్తో కాస్త బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో మాత్రం యమా బిజీ. మ్యాగజైన్ కవర్ ఫొటోస్ అంటూ హడావిడి చెయ్యడం, [more]

Update: 2019-12-15 06:11 GMT

ప్రస్తుతం తమిళ, బాలీవుడ్ సినిమాల్తో కాస్త బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో మాత్రం యమా బిజీ. మ్యాగజైన్ కవర్ ఫొటోస్ అంటూ హడావిడి చెయ్యడం, వళ్ళు తగ్గించుకోవడానికి జిమ్ లో చేరడం. సినిమాలు ఉన్నా లేకపోయినా… రకుల్ మాత్రం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూనే ఉంటుంది. ఒకసారి యోగ అంటూ అద్భుతమైన ఆసనాలతో మత్తెకించే రకుల్.. ఎప్పుడూ జిమ్ లో వర్కౌట్స్ చేసే వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. జిమ్ లో రకుల్ ప్రీత్ వర్కౌట్స్ ఒక ఎత్తైతే… ఆమె హాట్ అందాలు మరో ఎత్తు. జిమ్ డ్రెస్ లో రకుల్ అందాల ఆరబోత చూడడానికే చాలామంది రకుల్ ని ఫాలో అవుతారా అనిపిస్తుంది.

బాడీ ని షేప్ చేసుకోవడానికి నిరంతరం జిమ్ లో చమట్లు కక్కించే రకుల్ తడి అందాలను చూడడానికి రెండు కళ్ళు చాలవు. తాజాగా రకుల్ ప్రీత్ జిమ్ లో చేసిన ఓ వీడియో వైరల్ అయ్యింది. రకుల్ కష్టపడి ఎన్ని కేలరీస్ బర్న్ చేసిందో తెలియదు కానీ… రకుల్ హాట్ జిమ్ వీడియో మాత్రం లక్షల్లో లైక్స్ సంపాదించింది. సినిమాల్లో అందాలు ఆరబోత వేరు.. ఇలా జిమ్ లో జిమ్ డ్రెస్ లో ఆరబోసే అందాలు వేరు. మరి టాలీవుడ్ లో ఈ రేంజ్ జిమ్ వర్కౌట్స్ చేసే హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ నెంబర్ వన్ లో ఉంటుందేమో. ఇక రకుల్ కి ఎంతో ఇష్టమైన జిమ్ ని బిజినెస్ గా కూడా మార్చేసింది.

Tags:    

Similar News