రంగ‌స్థ‌లాన్ని భ‌య‌పెడుతోన్న ర‌న్ టైం

Update: 2018-03-26 05:36 GMT

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సినిమా రంగ‌స్థ‌లం 1985. ఇప్ప‌టికే ట్రైల‌ర్లు, టీజ‌ర్ల ద్వారా సినిమాపై హైప్ మామూలుగా లేదు. 1985 నేప‌థ్యంలో పల్లెటూరి వాతావ‌ర‌ణంలో తెర‌కెక్కిన ఈ సినిమా అంతా చాలా కొత్త‌గా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. చెర్రీ - స‌మంత జోడీ క‌ట్ట‌డం, స్టిల్స్ చాలా కొత్త‌గా ఉండ‌డంతో సినిమా ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది.

ఇక రంగ‌స్థ‌లం సినిమాలో అనసూయది చాలా కీలమైన పాత్ర అంట. సినిమా చివర్లో ఆమె పాత్రనే కీలకం అవుతుందని టాక్ వినిపిస్తోంది. దేవిశ్రీ ఆల్బ‌మ్‌కు కూడా అదిరిపోయే టాక్ వ‌చ్చింది. అయితే సినిమాకు ర‌న్ టైం పెద్ద మైన‌స్ అవుతుందా ? అన్న సందేహాలు మెగా అభిమానుల నుంచే వ‌స్తున్నాయి. రంగ‌స్థ‌లం సినిమా నిడివి 2.52 నిమషాల దగ్గర ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

వాస్త‌వంగా అయితే రంగ‌స్థ‌లం టోట‌ల్ ర‌న్ టైం 3 గంట‌ల‌కు పైనే అట‌. అయితే నిడివి బాగా ఎక్కువ కావ‌డంతో కాస్త తర్జన భర్జనలు పడి, మెగాస్టార్ సలహాలు, సూచనలు కూడా తీసుకున్న తరువాత అక్కడే ఫిక్స్ చేసారట. ఇంత ర‌న్ టైం అంటే చాలా ఎక్కువ‌. 172 నిమిషాల పాటు థియేట‌ర్లో కూర్చొని సినిమా చూడాలంటే చాలా ఓపిక కావాలి.

అంత సేపు థియేట‌ర్లో కూర్చోపెట్టే కంటెంట్ ముఖ్యం. మ‌రి సుకుమార్ ఈ విష‌యంలో ఏం మ్యాజిక్ చేశాడో ? చూడాలి. ఇక సినిమా క్లైమాక్స్ విష‌యంలో రెండు మూడు డిస్క‌ర్ష‌న్లు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. రెండు మూడు క్లైమాక్స్‌లు షూట్ చేసి ఫైన‌ల్‌గా ఓ క్లైమాక్స్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక రంగ‌స్థ‌లం ఈ నెల 30న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

Similar News