రంగస్థలాన్ని పెళ్లి భోజనం తో పోల్చాడే

Update: 2018-03-29 09:26 GMT

రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో వస్తున్న రంగస్థలం మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై భారీఅంచనాలే ఉన్నాయి. గత మూడు నెలలుగా ఒక్క భారీ బడ్జెట్ చిత్రం కూడా హిట్ అయినా దాఖలాలు లేవు. అందుకే ప్రేక్షకులంతా రంగస్థలంపై ఎన్నిఅంచనాలైతే ఉన్నాయో అన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి ఎప్పుడు మోడ్రెన్ మోడ్రెన్ అంటూ అప్డేటెడ్ గా ఉండాలంటూ హాలీవుడ్ సినిమాలను కాపీ చేస్తూ అదరగొట్టేస్తున్న మోడ్రెన్ డైరెక్టర్స్ ఉన్న ఈకాలంలొ ఒక మెడ్రెన్ డైరెక్టర్ సుకుమార్ ఇలా పక్క గ్రామీణ వాతావరణంలో సినిమాని తెరకెక్కించడం మాత్రం ఒక అద్భుతమైన విషయమే. ఎందుకంటే సుకుమార్ కూడా ఎప్పుడు క్లాస్ క్లాస్ అంటూ యూస్ చుట్టూ తిరిగే వ్యక్తే,.

మరికొంది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రంగస్థలం సినిమా గురించి సుకుమార్ తన అనుభవాలను చేబుతున్నాడు. తనకు కలిగిన అనుభవాలను అద్భుతమైన సన్నివేశాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తానని చెబుతున్న సుకుమార్ ఆ కథను హ్యాండిల్ చేయడానికి తనకు తగినంత అనుభవం ఉందా లేదా అని కూడా ముందుగా ఆలోచించుకుంటాడట. అలా తనకు నచ్చిన పల్లెటూరి నేపథ్యంతో ఉన్న సినిమాని చేయాలనే తలంపుతోనే రంగస్థలం చేశానంటున్నాడు... అంతేకాకుండా రంగస్థలం సినిమా మొత్తాన్ని 1980 లలో పెళ్ళికి వెళ్లినట్టుగా భావిస్తానని చెబుతున్నాడు ఈ దర్శకుడు.

1980 లలో పెళ్లి భోజనాలు అంటే .. టొమాటా పప్పు, నెయ్యి, గుత్తి వంకాయ కూర, కొబ్బరికాయ పులుసు, గడ్డ పెరుగు ఇలా అన్నిరకాల కలిపి ఫుల్ మీల్స్ చేసేయచ్చు. మరి చూడడానికి అరిటాకులో మెను సింపుల్ గానే ఉన్నా అదికాస్తా నోరు ఊరించేస్తుంది. మరి ఇప్పుడు మేము తెరకెక్కించిన రంగస్థలంలో మొత్తం అన్ని వంటకాలను సమపాళ్లలో రంగరించి అందించానని భావిస్తున్నాను అంటూ ఒక పెళ్లి భోజనం తో రంగస్థలాన్ని పోల్చి సినిమా అంటే ఫుల్ మీల్స్ అనేశాడు సుకుమార్. మరి ఈ ఫుల్ మీల్స్ ఎంతమందిని ఆకట్టుకుందో అనేది మరి కొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది.

Similar News