రంగస్థలం సినిమా కి అమెరికాలో కష్టాలు

Update: 2018-03-28 05:11 GMT

మన స్టార్ హీరోస్ సినిమాలకు ఓవర్సీస్ లో మార్కెట్ రోజురోజుకి పెరగడంతో అక్కడ మార్కెట్ పై ద్రుష్టి పెట్టారు ఇక్కడ నిర్మాతలు. సుకుమార్ సినిమాలు అంటే అక్కడ మంచి క్రేజ్ ఉంది. నాన్నకు ప్రేమతో సినిమాకు ఇక్కడ జనాలు పెద్దగా కనెక్ట్ కాకపోయినా అక్కడ మాత్రం మిలియన్ డాలర్ క్లబ్ లో త్వరగా చేరిపోవడం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు.

అలానే ఇక్కడ డిజాస్టర్ అయినా మహేష్ బాబు '1 నేనొక్కడినే' మూవీ ని అక్కడి ప్రేక్షకులు ఆదరించారు. కానీ అమెరికాలో 'రంగస్థలం' హడావిడి ఏమి కనిపించట్లేదు. దీనికి కారం డిస్ట్రిబ్యూటర్ ప్లానింగ్ లోపమే అని తెలిసింది. రిలీజ్ డేట్ ముందే ప్రకటించిన అక్కడి డిస్ట్రిబ్యూటర్ థియేటర్స్ ని బుక్ చేసుకోవటంలో కానీ...స్క్రీన్స్ ని సెట్ చేసుకోవడం లాంటి చర్యలేవి పక్కాగా తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని సమాచారం.

పైగా అక్కడి 'రంగస్థలం' డిస్త్రిబ్యూట్ చేస్తున్న సంస్థ ఈ రంగానికి కొత్త కావడం వల్ల ఆ అనుభవ రాహిత్యం బిజినెస్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దానివల్లే మొదటి రోజు ఆన్ లైన్ టికెట్స్ ఇంకా పూర్తిగా సేల్ కాకపోవడమే దీనికి నిదర్శనం. అర్జున్ రెడ్డి.. ఆనందో బ్రహ్మ లాంటి సినిమాలే మిలియన్ మార్కును అందుకుంటున్న టైంలో 'రంగస్థలం' లాంటి పెద్ద సినిమాను లైట్ గా తీసుకోవడం కరెక్ట్ కాదు. మరి కనీసం ఈ రోజున్న రంగస్థలాని కి ఈ అడ్డంకులు అన్ని తొలిగిపోతాయేమో చూద్దాం.

Similar News