రంగస్థలం రికార్డు ఫేకా..?

Update: 2018-04-15 15:15 GMT


రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మార్చ్ 30 న విడుదలైన రంగస్థలంసినిమా టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు కొత్త కళ తీసుకొచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో అజ్ఞాతవాసి, జై సింహ సినిమాలు బాక్సాఫీసుని షేక్ చేయలేకపోయాయి. భాగమతి, తొలిప్రేమ చిత్రాలు బాక్సాఫీసుని షెకాడించినా... అవి భారిగా తెరకెక్కినవి కాదు. కానీ భారీ బడ్జెట్ తో తెరకెక్కి భారీ హాట్ కొట్టింది మాత్రం రంగస్థలమే . ప్రస్తుతం రంగస్థలం కలెక్షన్స్ ఖైదీ నెంబర్ 150 ని దాటి నాన్ బాహుబలి రికార్డులను నెలకొల్పింది. అంచనాల్ని మించి విజయం సాధించిన ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల షేర్ మార్కును దాటింది. ‘

చిరు 150 కలెక్షన్స్ క్రాస్ చేసిన రంగస్థలం తో రామ్ చరణ్ తండ్రిని తలదన్నే కొడుకుగా అవతరించాడు. మరి ఇలా రంగస్థలం రికార్డును భారీ ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ ఈ లోపు రంగస్థలం సినిమా 175 క్రోర్స్ గ్రాస్ అంటూనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా అభివర్ణిస్తుండటంతో ఇపుడు రంగస్థలంపై సోషల్ మీడియాలో సెట్టైర్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ పోస్టర్ ని అలాఎందుకు వేసారో గాని.. ఇపుడు రంగస్థలం కలెక్షన్స్ ఫెకా అంటూ కామెడీ చేసేస్తున్నారు. ఇలా ఎందుకంటునంరంటే గత ఏడాది బాహుబలి 2 టాలీవుడ్ లో కలెక్షన్స్ పరంగా నెంబర్ 1 స్థానంలో ఉంది. మరి బాహుబలి ఉండగా రంగస్థలం ఎందుకు తెలుగులో బిగ్గెస్ట్ హిట్ అవుతుందంటున్నారు. కాకపోతే ఆ పోస్టర్ లో ఎడమ వైపు... కనిపించీ కనిపించకుండా చిన్న అక్షరాల్లో నాన్-బాహుబలి అని డిస్క్లైమర్ వేశారు కానీ.. అది జనాలకు ఎక్కడ కనబడుతుంది....

మరి ఆల్రెడీ హిట్ అయిన రంగస్థలం గురించిన ఇలాంటి ప్రచారం అవసరమా అంటూ కొంతమంది సెట్టైర్స్ వేస్తున్నారు. మరి ఆ డిస్క్లైమర్ సరిగ్గా కనబడక రంగస్థలం కలెక్షన్స్ ఫెక్ అంటూ రచ్చ జరగడం వలన ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద దడదడ లాడిస్తున్న సినిమాకి ఒకింత నెగెటివ్ నెస్ వస్తుంది అంటున్నారు.

Similar News