రంగస్థలం పై పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ..?

Update: 2018-03-25 08:13 GMT

ప్రస్తుతం మార్కెట్ లో రంగస్థలం హడావిడి క్కువగా కనబడుతుంది. రంగస్థలం పాటలు మాములుగా పిచ్చెక్కించడం లేదు. ఎవరి ఫోన్ లో చూసిన అదే, ఎవరి కార్ లో చూసిన రంగస్థలం ఆల్బంపాటలే. మరో వారంలో రంగస్థలం విడుదల వుంటుంది. అయితే ఏప్రిల్ 20 న విడుదల కాబోయే భరత్ అనే నేను హడావిడి కూడా ఆల్మోస్ట్ మొదలైపోయింది. ఇప్పటికే శ్రీరామనవమి పండుగ సందర్భంగా దేవిశ్రీ మ్యూజిక్ అందించిన భారత్ అనే నేను సింగిల్ రావడం అందరిని నచ్చడం జరిగిపోయింది. భారత అనే నేను ఆడియో వేడుకను ఏప్రిల్ 7 న జరపడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది.

అది కూడా ఏపీలోని వైజాగ్ లో భరత్ అనే నేను ఆడియో వేడుకను జరపతలపెట్టింది. ఇది ఎప్పటినుండో ప్రచారంలో ఉన్నమాట. ఇక రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ ఏ లెవల్లో గ్రాండ్ సక్సెస్ అయ్యిందో అలాగే భారత్ అనే నేను ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని భావించారు. అయితే తాజాగా భరత్ అనే నేను ఆడియో వేడుక వైజాగ్ నుండి అమరావతికి మారినట్లుగా నిన్న శనివారం సాయంత్రం నుండి సోషల్ మీడియాలో ఒకటే హడావిడి. అయితే ఉన్నట్టుండి ఈ ఆడియో వేడుకనిఅమర్చడానికి గల కారణం పవన్ అనే మాట వినబడుతుంది.

పవన్ కళ్యాణ్ ఈ మధ్యన ఏపీ ప్రభుత్వానికి, టిడిపి నాయకులకు వ్యతిరేఖంగా తీవ్ర వ్యాఖ్యలు చెయ్యడంతో ప్రజల్లో పవన్ కి ఫాలోయింగ్ పెరిగే అవకాశం ఉండడం తో ఇలా అమరావతిలో మహేష్ బాబు భరత్ అనే నేను ఆడియో ని నిర్వహిచి పవన్ కళ్యాణ్ క్రేజ్ కి మహేష్ తో చెక్ పెట్టాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి మహేష్ బావ గల్లా జయదేవ్ ద్వారా మహేష్ ఆడియో వేడుకని వైజాగ్ నుండి అమరావతికి మార్పించినట్లుగా చెబుతున్నారు. గల్లా జయదేవ్ మహేష్ కి చేసిన రిక్వెస్ట్ తోనే వైజాగ్ లో జరగాల్సిన ఈ వేడుక కాస్తా అమరావతికి షిఫ్ట్ అయినట్లుగా తెలుస్తుంది ఇక దీని మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News