రంగస్థలం దెబ్బకి భరత్ డల్ అయ్యాడు

Update: 2018-04-26 07:18 GMT

టాలీవుడ్ లో ఇప్పుడున్న హీరోస్ లో అత్యధిక ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకడు. అతడి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డ్స్ మారుమోగిపోతాయి. శ్రీమంతుడు విషయంలో అదే జరిగింది. నాన్ బాహుబలి రికార్డ్స్ ను చెరిపేసి హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిందా చిత్రం. ఇప్పుడు భారీ అంచనాలతో రిలీజ్ అయిన భరత్ అనే నేను కూడా కొత్త రికార్డులు నమోదవడం ఖాయమనే అనుకున్నారంతా.

అందుకు తగ్గట్లే తొలి వారాంతంలో భారీ వసూళ్లే సాధించిందీ చిత్రం. వీకెండ్స్ విషయంలో మూడు వారాలు కిందటే రిలీజ్ అయిన ‘రంగస్థలం’ కంటే స్వల్పంగా అధిక కలెక్షన్లే సాధించింది ‘భరత్ అనే నేను’. అదే ఊపు కొనసాగించి రన్గస్థలం ఫుల్ రన్ వసూళ్లను కూడా ఇది దాటేస్తుందని అనుకున్నారంతా. కానీ ట్రేడ్ నిపుణులు పరిశీలిస్తే అలా ఏమీ కనిపించడం లేదు.

భరత్ అనే నేను వసూల్ అయితే బాగానే ఉన్నాయ్ కానీ రంగస్థలం అంత ఎక్స్‌ట్రార్డినరీగా లేవు. రంగస్థలంకి కలిసొచ్చిన విషయం ఏంటంటే ఇందులో వినోదం బాగానే ఉంటుంది కానీ భరత్ అనే నేను కు ఈ సానుకూలతలు లేవు. అందుకే రంగస్థలం ఇంకా బాగా ఆడుతుంది. పైగా ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు రెండు సార్లు చూస్తున్నారు. రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు కానీ భరత్ అనే నేనుకి మాత్రం ఆలా జరగపోవడంతో వసూల్ డల్ అయ్యాయి. దీంతో వీక్ డేస్‌లో ‘రంగస్థలం’ స్థాయిలో హోల్డ్ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి మహేష్ రేంజికి వీకెండ్లో చరణ్‌‌తో పోలిస్తే ఎక్కువ వసూళ్లు రాబట్టాల్సింది. రంగస్థలం ఫుల్ రన్ లో రూ.110 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ‘రంగస్థలం’ రికార్డును బద్దలు కొట్టడం కష్టమే అనిపిస్తోంది.

Similar News