రంగస్థలం గురించి మనకి తెలియని విషయాలు!!

Update: 2018-03-26 13:00 GMT

రంగస్థలంలో చిట్టి బాబు లుక్ కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడు? రంగస్థలం టైటిల్ నుండి సడెన్ గా 1985 అనే నెంబర్ ఎందుకు తీసేసారు? చరణ్ గడ్డం పెంచాలన్న ఐడియా ఎవరిది? వీటన్నింటికి చరణ్ ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు.

ఒక టైంకు ఎందుకు పరిమితం చేయడం?

"ఈ సినిమాను ఒక టైంకు ఎందుకు పరిమితం చేయడం అనిపించింది. ముఖ్యంగా ఈ స్టోరీ 1980ల నాటి కథ. ప్రత్యేకంగా 1985 అని చెబితే అప్పటి ఫ్యాషన్లు తెరపైకొస్తాయి కదా అందుకే ఆ నెంబర్ తీసేశాం.""చిట్టి బాబు లుక్ కోసం చాలానే కష్టపడ్డాం. చాలా లుక్స్ ట్రై చేశాం. లూజ్ ప్యాంట్స్..బెల్ బాటమ్స్..హెయిర్ స్టయిల్..గడ్డం..ఇలా చాలానే లుక్ ట్రై చేశాం కానీ పైనల్ గా గడ్డం, గళ్ల లుంగీకి ఫిక్స్ అయ్యాం."

80 శాతం లుంగీతోనే....

సినిమాలో 80శాతం తను లుంగీలోనే కనిపిస్తానని అంటున్నాడు చరణ్. టెస్ట్ షూట్ సుకుమార్ చుక్కలు చూపించాడు. ఎన్ని వెర్షన్లు తీశాడో తనకే గుర్తులేదు అన్నాడు చరణ్. ఇక సుకుమార్ తనకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు లుంగీ కట్టుకొని ఉన్నానని, దాంతో సుకుమార్ సినిమాలో లుంగీ గెటప్ కే ఫిక్స్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. నిజానికి 80ల నాటి పల్లెల్లో ప్యాంట్లు కంటే లుంగీలే ఎక్కువగా ఉండేవంటున్నాడు చరణ్.

Similar News