రంగమ్మత్తలా కాదు.. ఈసారి కత్తిలా..!

హాట్ యాంకర్ అనసూయ బుల్లితెర మీద జబర్దస్, లోకల్ గ్యాంగ్స్ అంటూ స్టేజ్ మీద ఓ ఊపు ఊపుతుంది. జబర్దస్త్ లో చిట్టిపొట్టి డ్రెస్సు లతో అదరగొడుతున్న [more]

Update: 2020-01-20 07:52 GMT

హాట్ యాంకర్ అనసూయ బుల్లితెర మీద జబర్దస్, లోకల్ గ్యాంగ్స్ అంటూ స్టేజ్ మీద ఓ ఊపు ఊపుతుంది. జబర్దస్త్ లో చిట్టిపొట్టి డ్రెస్సు లతో అదరగొడుతున్న అనసూయ.. లోకల్ గ్యాంగ్స్ లో హాట్ హాట్ గా సారీస్ తో ఇరగదీస్తోంది. వారానికోసారి అనసూయ హాట్ హాట్ గా వార్తల్లో నిలుస్తుంది. ఇక వెండితెర మీద సుకుమార్ అనసూయ ని కొత్తగా రంగమ్మత్త పాత్రలో చూపించాడు. అందులో రామ్ చరణ్ కి హెల్ప్ చేసే అత్త పాత్రలో అనసూయ ఇరగదీసింది. ఇక సుకుమార్ మరోసారి అనసూయని కత్తిలాంటి పాత్రలో బన్నీ సినిమాలో చూపించబోతున్నాడట.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న బన్నీ – సుక్కు సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ మొదలెట్టుకొవడానికి రెడీగా ఉంది. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందం స్మగ్లింగ్ పై సుకుమార్ సినిమా చేస్తున్నాడు. అల్లు అర్జున్ ఈ సినిమాలో కొద్ది నిమిషాల పాటు స్మగ్లర్ గా కాస్త రఫ్ లుక్ లో కనిపిస్తాడని అంటున్నారు. ఇకపోతే సుకుమార్ ఈసారి అనసూయని పాజిటివ్ గా కాకుండా నెగెటివ్ గా చూపించబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది. అడవుల్లో బందిపోటు రాణిగా నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించినుందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి అడవిశేష్ క్షణంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఇరగదీసిన అనసూయ.. ఇప్పుడు సుక్కు – బన్నీ సినిమాలో విలనిజాన్ని ఎలా పండిస్తుందో అంటున్నారు.

Tags:    

Similar News