యూట్యూబ్, హిందీ చానెల్స్‌లో మన హీరోల జోరు

Update: 2016-11-30 13:50 GMT

మన కథానాయకులకు ఉత్తరాదిన ఎక్కువ క్రేజ్ లేనప్పటికీ, మన హీరోల క్రేజీ ప్రాజెక్ట్స్కు కూడా ఉత్తరాదిన నామ మాత్రపు థియేటర్ లే దొరుకుతుండటం ఉత్తరాదిన మన వారి దిగువ స్థాయి పెర్ఫార్మన్స్ కు అడ్డం పడుతుంటే, హిందీలోకి అనువాదమవుతున్న మన తెలుగు చిత్రాల యూట్యూబ్ వ్యూస్, హిందీ ఛానెల్స్ లో ప్రసారమవుతున్న మన అనువాద చిత్రాలకు వస్తున్న టీ.ఆర్.పీ రేటింగ్స్ పరిగణలోకి తీసుకుంటే మాత్రం మన కథానాయకులు, దర్శకుల చిత్రాలు అగ్ర స్థాయిలో నిలుస్తుండటం విశేషం. వీరిలో అల్లు అర్జున్, నితిన్, పూరి జగన్నాథ్, ప్రభాస్ వంటి ప్రముఖల చిత్రాలు ముందు వరుసలో నిలుస్తున్నాయి.

హార్ట్ ఎటాక్, సన్ ఆఫ్ సత్య మూర్తి, బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై చిత్రాలు మన బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గ్రోస్సెర్స్ గా నిలవగా హిందీలోకి అనువాదమైన ఇవే చిత్రాలు యూట్యూబ్ లో లక్షల్లో వ్యూస్ అనతి కాలంలోనే దక్కించుకుంటున్నాయి. హార్ట్ ఎటాక్ చిత్రం హిందీలో అప్లోడ్ చేసిన రెండు రోజుల వ్యవధిలోనే 30 లక్షల వ్యూస్ దాటగా, సన్ ఆఫ్ సత్యమూర్తి హిందీ వెర్షన్కి కోటిన్నర కు పైగా వ్యూస్ దక్కటం విశేషం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ కాలేకపోయినప్పటికీ యూట్యూబ్ లో మాత్రం టూ మిలియన్ వ్యూస్ దాటేసింది. బాహుబలి విడుదల తరువాత వచ్చిన క్రేజ్ తో ఘోర పరాజయం చెందిన రెబెల్ చిత్రానికి యూట్యూబ్ లో హిందీ వెర్షన్ కి గుర్తింపు దొరుకుతుండటం విశేషం.

ఇటీవలి కాలంలో అల్లు అర్జున్, తారక్, ప్రభాస్ వంటి ప్రముఖ నటుల చిత్రాలే కాక ఒకటి రెండు చిత్రాలు చేసిన నూతన హీరోల చిత్రాలు కూడా హిందీలోకి అనువాదమై వాటి స్థాయి సంచలన వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి.

Similar News