యుఎస్‌లో మిలియన్‌ డాలర్లు సాధించినా సంతోషంగా లేదంట

Update: 2018-01-10 08:00 GMT

సినిమా ప్లాప్ అయినా హిట్ అయినా తన నెక్స్ట్ మూవీస్ నిమగ్నమైపోవడం నాగార్జున స్టయిల్‌. హిట్ అయితే మరింత ప్రచారం చేస్తాడు. అదే హిట్ కాకపోతే దాని తిరిగి వెనక్కి చూడని కూడా చూడడు. అయితే తన కొడుకు సినిమా హలో సినిమా విషయంలో తేలికగా తీసుకోలేకపోతున్నాడు నాగ్.

తెలుగు రాష్ట్రాలలో హలో సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. ఇక్కడ ఇది కమర్షియల్‌గా పెద్ద ఫ్లాప్‌ అయినా కానీ యుఎస్‌లో మిలియన్‌ డాలర్లు సాధించడం నాగార్జునని ఆనందంలో ముంచెత్తింది. యుఎస్‌లో మిలియన్‌ డాలర్లు సాధించడం గొప్ప ఫీట్‌ అయినప్పటికీ హలోకి అక్కడ వచ్చిన వసూళ్లు గొప్పవేం కాదనే చెప్పాలి. ఎందుకంటె ఈ సినిమా మొదట్లో అయిదు కోట్లకి కొనేందుకు బయ్యర్లు సిద్ధపడ్డారు. కానీ నాగార్జున మరింత వస్తుందనే నమ్మకంతో అమ్మలేదు.

తర్వాత అమ్ముదాం అనుకునేసరికి రేట్ తక్కువగా పలకడంతో.. యూఎస్ లో నాగ్‌ ఈ చిత్రాన్ని స్వయంగా విడుదల చేసుకున్నాడు. ఇప్పుడు షేర్‌ మూడు కోట్ల కంటే తక్కువే వుంటుంది. అంటే మొదట పలికిన రేటుకి తగ్గ వసూళ్లని కూడా హలో అక్కడ సాధించలేకపోయింది. ఇక ఈ సినిమా ప్లాప్ అవ్వటం పట్ల అక్కినేని ఫ్యాన్స్ ఫీల్ అయ్యి బహిరంగ లేఖలు కూడా రాస్తున్నారు.

Similar News