యవ్వనంలో సాధించని ఘనత వృద్ధాప్యంలో

Update: 2016-11-27 07:00 GMT

బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నట జీవితంలో అర్ధ శతాబ్ధాన్ని పూర్తి చేసుకున్నారు. ఐనా ఆయన అలుపు లేకుండా నేటికీ వరుస చిత్రాలతో ప్రేక్షకులను రంజింపచేస్తున్నారు. లేట్ వయసులో బిగ్ బి కమర్షియల్ అప్పీల్ తక్కువ వున్న కథలలో ఆయనకీ తగ్గ హుందా పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఆయన లోని నటుడిని స్నాతృప్తి పరచుకుంటున్నారు. ఇటీవల ఆయన నటించిన పింక్ చిత్రం బాలీవుడ్ లో విజయాన్ని నమోదు చేయగా ఇప్పుడు భారతీయ చలన చిత్ర కీర్తిని మరో మెట్టు ఎక్కించటానికి పింక్ చిత్రం దోహదపడింది.

నేటి సమాజంలో సామాన్య ప్రజలకు అందుబాటులోలేని చట్ట పరమైన తప్పిదాల ఇతివృత్తంతో ముగ్గురు యువతుల జీవితాలు ప్రభావితమయ్యాయో తెలిపే కథనంతో తెరకెక్కిన పింక్ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ బైపోలార్ డిస ఆర్డర్ తో బాధపడే రిటైర్డ్ న్యాయవాది పాత్ర పోషించగా తాప్సి పన్ను, ఆండ్రియా తరియాంగ్, కీర్తి కొల్హర్ ముఖ్య భూమికలు పోషించిన ఈ చిత్రం పౌరులను చైతన్య పరిచే అంతర్లీన ఇతివృత్తం కలిగి ఉండటంతో న్యూయార్క్ లోని అంతర్జాతీయ సదస్సు లో పింక్ చిత్రాన్ని ప్రదర్శనకు స్వీకరించింది అంతర్జాతీయ సదస్సు కమిటీ. ఆసియా ఖండం నుంచి ఫిలిం ఫెస్టులకు తరచు గ మన చిత్రాలు వెళ్తున్నప్పటికీ అంతర్జాతీయ సదస్సు లో ప్రదర్శనకు నోచుకున్న చిత్రం గా పింక్ చరిత్ర సృష్టించనుంది.

Similar News