యంగ్ హీరోస్ కంటే రెట్టింపు జోరుతో సినిమాలు చేస్తున్నాడే

Update: 2018-01-06 06:35 GMT

బాలీవుడ్ అగ్ర కథానాయకులలో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ లు ఏడాదికి ఒక్క విడుదల లేదా కొన్ని సార్లు ఏడాదిన్నర్ర కాలానికి ఒక విడుదలతో ప్రేక్షకులని పలకరిస్తుంటే మరో సీనియర్ హీరో అక్షయ్ కుమార్ యువ హీరోల కంటే రెట్టింపు వేగంతో చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలి కాలంలో వాణిజ్య అంశాలతో పాటు సామాజిక సందేశం తాను నటించే చిత్రాలలో మేళవించి చెప్తూ వరుసగా సక్సెస్ అవుతున్నారు అక్షయ్ కుమార్. జోలీ ఎల్.ఎల్.బి 2 , టాయిలెట్ ఏ ప్రేమ్ కథ విజయాల జోరులో వున్న అక్షయ్ కుమార్ నుంచి ఈ ఏడాది మూడు విడుదలలు ఉండబోతున్నాయి.

ఈ గణతంత్ర దినోత్సవం సందర్భముగా పాడ్ మాన్ చిత్రం విడుదలకి సిద్ధం అవుతుండగా ఈ ఏడాది వేసవి నాటికి ప్రస్తుతం సెట్స్ పై వున్న గోల్డ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా అక్షయ్ కుమార్ మరో సంచలనాత్మక చిత్రం ఒప్పుకున్నారు. దశాబ్దాల క్రితం ఈశాన్య సరిహద్దులలో ఆఫ్ఘనిస్తాన్ వారికి సిక్కులకు జరిగిన పోరాట నేపథ్యంలో సాగే చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నారు అక్షయ్. ఆ చిత్ర ఫస్ట్ లుక్ ని సోషల్ మీడియా లో విడుదల చేశారు. మరో వైపు అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్ర పోషించిన మరో క్రేజీ ప్రాజెక్ట్ 2.0 వేసవికి విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Similar News